జగన్నాథుడికి స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు.. దేవుడికి 15 రోజుల చికిత్స ఎందుకు చేస్తారో తెలుసా?

Anasara Ritual: స్నాన పౌర్ణిమ తర్వాత జగన్నాథుడికి జ్వరం వచ్చినట్లు భావించి 15 రోజుల పాటు 'అనసార' కాలంలో ప్రతీకాత్మకంగా ఆయుర్వేద చికిత్స నిర్వహిస్తారు. అనంతరం 'నవజౌవన దర్శనం' ఇస్తారు. అయితే స్టెతస్కోప్‌తో స్వామివారికి వైద్య పరీక్షలు నిర్వహించే అరుదైన సంప్రదాయం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జగన్నాథ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

జగన్నాథుడికి స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు.. దేవుడికి 15 రోజుల చికిత్స ఎందుకు చేస్తారో తెలుసా?
Anasara Ritual

Updated on: Jul 18, 2026 | 12:05 PM

Lord Jagannath Medical Checkup Telugu: ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామివారికి ప్రతీకాత్మకంగా వైద్య పరీక్షలు నిర్వహించే అపూర్వమైన సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం స్నాన పౌర్ణిమ సందర్భంగా శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవికి 108 పవిత్ర కలశాల జలంతో మహా అభిషేకం (రాజస్నానం) నిర్వహిస్తారు. ఈ అభిషేకం అనంతరం దేవతలకు జ్వరం వచ్చినట్లుగా భావిస్తారు. దీంతో ప్రారంభమయ్యే ‘అనసార’ కాలంలో వరుసగా 15 రోజుల పాటు స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వరు. ఈ సమయంలో రాజవైద్యులు సంప్రదాయ ఆయుర్వేద విధానంలో ప్రతీకాత్మక వైద్య సేవలు అందిస్తారు. ఆయుర్వేద ఔషధాలు, పథ్యాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ, స్వామివారి ఆరోగ్యం కోసం ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు.

15 రోజుల అనంతరం స్వామివారు పూర్తిగా కోలుకున్నారని ప్రతీకాత్మకంగా నిర్ధారించిన తర్వాత, ‘నవజౌవన దర్శనం’ పేరుతో జగన్నాథుడు నూతన కాంతితో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత ‘రథయాత్ర’ మహోత్సవానికి శ్రీకారం చుడతారు. ఈ సంప్రదాయం పూరీ ప్రధాన ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక జగన్నాథ ఆలయాల్లో కూడా పాటిస్తారు.

అయితే, దేవుడి విగ్రహాన్ని ఆధునిక వైద్యులు స్టెతస్కోప్‌తో నిజమైన రోగిని పరీక్షించినట్లుగా ప్రతీకాత్మకంగా పరీక్షించే అరుదైన ఆచారం మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ శ్రీ జగన్నాథ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వినూత్న ఘట్టాన్ని చూసేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలివస్తారు. కాగా, ప్రస్తుతం పూరీలోని జగన్నాథుడు రథయాత్రగా గుండిచా దేవాలయానికి బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ ఆలయంలోనే ఆయన సుమారు వారం రోజులపాటు బస చేయనున్నారు. ఆ తర్వాత తిరిగి పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు హిందూ ఆలయ సంప్రదాయాలు, ఆచారాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. దేవతలకు నిర్వహించే వైద్య పరీక్షలు, చికిత్సలు ప్రతీకాత్మక ఆధ్యాత్మిక సంప్రదాయాలు మాత్రమే. వీటిని శాస్త్రీయ లేదా వైద్యపరమైన ప్రక్రియలుగా పరిగణించరాదు.)

Follow Us