Daughter In Law: కూతురు, కోడలు..ఎవరు ఎక్కువ అంటే.. కోడలే ఎక్కువ అంటుంది సనాతన ధర్మం.. ఎందుకంటే

|

Aug 21, 2021 | 8:43 AM

Daughter In Law: భారతదేశాన్ని.. హిందూ సంప్రదాయాన్ని ప్రపంచానికి గొప్పగా చూపించేది కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం. కుటుంబంలో సంబంధాలు,..

Daughter In Law: కూతురు, కోడలు..ఎవరు ఎక్కువ అంటే.. కోడలే ఎక్కువ అంటుంది సనాతన ధర్మం.. ఎందుకంటే
Daughter In Law
Follow us on

Daughter In Law: భారతదేశాన్ని.. హిందూ సంప్రదాయాన్ని ప్రపంచానికి గొప్పగా చూపించేది కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం. కుటుంబంలో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి. కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలు .. పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం ఆడవారు, మగవారు వేరు వేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగించే సమాజంలో భార్యాభర్తలుగా సహజీవనం సమాజం ఆర్థికవ్యవస్థకు చాలా అవుసరమౌతుంది. అయితే హిందూ సంప్రదాయంలో కడుపున పుట్టిన కూతరు కంటే.. కొడుకు పెట్టె పిండం కంటే .. దీపం పెట్టె కోడలు ఎక్కువ. కుటుంబంలో కూతురా.. కోడలా ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు కోడలే ఎక్కువ అని సమాధానం చెబుతుంది సనాతన హిందూ ధర్మం. ఎందుకో తెలుసా..

*పుట్టింట్లో గారాల కూతురుగా .. పెరిగి అత్తింట్లోకి అడుగు పెడుతూ.. చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ ‘త్యాగశీలి’ కోడలు…
*కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే ‘గుణశీలి’ కోడలు..
*తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల ‘భాగ్యశీలి’ కోడలు.
*తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే ‘శ్రమజీవి’ కోడలు.
*కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకో తెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా కోడలు.
*కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది శ్రాద్ధం పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య. ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..
*ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది, ఎందుకో తెలుసా.. కోడలే గృహలక్ష్మి. అందుకనే భారతీయ ధర్మంలో కోడలకి కూతురుకంటే అధిక స్థానం ఇచ్చారు.

Also Read: విష్ణువు అవతారల్లోకి ఒకటి.. విద్యార్థులు యాలకులతో పూజిస్తే మంచి విద్యనందించే హయగ్రీవ జయంతి రేపు