మనలో చాలా మంది తమ రోజును చాలా ఉత్సాహంగా ప్రారంభించి, అదే రీతిలో ఆ రోజును గడపాలనుకుంటారు. అయితే చాలా సందర్భాలలో ఏవో అనుకోని ఘటనలు, ఆలోచనలు మన మనసును పాడు చేయడమే కాాక మన రోజును కూడా నాశనం చేస్తాయి. ఈ క్రమంలో ఉదయం లేవగానే కొన్ని రకాల వస్తువులను చూడడం కూడా ఇందుకు ప్రధాన కారణమని వాస్తు, జీవనశైలి నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయా వస్తువులు, లేదా పనులు మీద ఉన్న మన బాధ్యతలు మనసుకు విసుగు, విరక్తి తెప్పించగలవని వారు పేర్కొంటున్నారు. అందువల్ల ఉదయం లేవగానే ఆ వస్తువులు చూస్తే.. రోజంతా మంచిగా ఉండదని.. ఏ పని తలపెట్టిన జరగదని అంటున్నారు. అంతేకాక ఇవి మన మానసిక పరిస్థితిపై ప్రభావం చూపి, ప్రతివిషయంలో వెనకడుగు వేసేలా చేస్తాయంట. ఇంకా వీటి వల్ల దరిద్రాన్ని ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుందని వాస్తు, జోతిష్య, జీవనశైలి నిపుణులు మాట. మరి ఈ క్రమంలో ఉదయం లేవగానే ఏయే వస్తువులను చూడకూడదో, ఏయే పనులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మరి ఏం చూడాలి..?: మీరు ఉదయం లేవగానే మీ అరచేతులను చూడాలి. ఎందుకంటే వ్యక్తి అదృష్టం వారి అర చేతుల్లోనే దాగి ఉంటుందట. అరచేతిలోకి చూస్తూ ‘కరాగ్రే వసతే లక్ష్మీ: కరమ్ధే సరస్వతి, కర్ములే తు గోవిందః ప్రభాతే కర్దర్శనం’ అని జపించి భగవంతుడిని మనసులో స్మరిస్తూ పూజించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..