Unique Ritual: ఒడిశా లో ఓ వింత ఆచారం ఒళ్లు గగుర్పొడుస్తుంది. మయూర్ భంజ్ జిల్లాలో వరూన్ బ్లాక్ ప్రాంతంలో స్థానికులు ఆచరిస్తున్న ఈ సంప్రదాయం.. దాన్ని చూస్తున్న వారి కళ్లల్లో భయం తెప్పిస్తుంది. శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా.. కత్తుల్లాంటి ముళ్లుండే ఈ నాగజెముడు మొక్కల మీద ఇలా పొర్లుదండాలు పెట్టడం ఇక్కడి వారి ఆచారం. ఇక నిప్పుల మీద డ్యాన్సులు వేస్తూ వెళ్లడం వారికి పండగ కింద లెక్క. తాడుతో కొట్టుకుంటూ బలప్రదర్శన చేయడం ఇక్కడి వారి ఆనవాయితీ.
ఒడిశాలోని మారుమూల ప్రాంతంలో ఈ మూఢాచారం కొనసాగుతోంది. దసరా సందర్భంగా ఇక్కడి వారు మూడు రోజుల వేడుక నిర్వహిస్తారు. దశమి రోజు ప్రారంభించి మూడు రోజుల పాటు సాగుతుందీ ఉత్సవం. ఈ మూడు రోజులు.. ఇలా రకరకాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. అయితే, ముళ్ల పొదల మీద పొర్లుదండాలు పెట్టినా.. వారికి ఏమీ కాదని.. అంతా దుర్గమ్మ చూసుకుంటుందని ఇక్కడి వారి నమ్మకం
ఇలాంటి సంప్రదాయాలను పాటించడం వల్ల దేవుడు సంతోషిస్తాడని నమ్ముతారు. అలాగే, కరువు సమయంలో ఇలా చేస్తే వర్షాలు కూడా పడతాయని నమ్మకం. ఈ వేడుకను ఆపేవారు లేకపోయినా.. దీని గురించి తెలిసి చూడడానికి మాత్రం పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఒడిశాతో పాటు ఝార్ఖండ్ నుంచి కూడా భక్తులు ఈ విరాట్ మేళాకు తరలివచ్చి మూడు రోజులు ఉత్సవాలను చూసి వెళ్తుంటారు.
Also Read: వర్షాకాలంలో ప్రకృతికి దగ్గరగా గడపాలని అనుకుంటున్నారా.. మనదేశంలో బెస్ట్ ప్లేసెస్ ఏవంటే