Tuesday Puja Tips: మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కొన్ని రోజుల్లో ప్రతి కోరిక నెరవేరుతుంది

మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు. ఈ రోజున సంకట మోచనుడైన హనుమంతుడిని పూజిస్తారు. ఉపవాసం పాటిస్తారు. బజరంగబలిని పూజించడం ద్వారా జీవితంలోని ప్రతి సంక్షోభం తొలగిపోతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో మంగళవారం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Tuesday Puja Tips: మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కొన్ని రోజుల్లో ప్రతి కోరిక నెరవేరుతుంది
Lord Hanuman Puja

Updated on: Nov 26, 2024 | 7:08 AM

హిందూ మతంలో మంగళవారం హనుమంతుడిని ఆరాధించడానికి అంకితం చేయబడిన రోజు. హిందూ మత విశ్వాసాల ప్రకారం బజరంగబలిని చిరంజీవిగా కలియుగంలో నడయాడే దైవం గా భావిస్తారు. మంగళవారం రోజున హనుమంతుడిని ఆరాధించడం వలన జీవితంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. కష్టాలు పరిష్కారమవుతాయి. ఈ రోజున హనుమంతుడికి సంబంధించిన కొన్ని చర్యలు ఫలవంతంగా ఉంటాయి. వీటిని పాటించడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి.

జ్యోతిష్య శాస్త్రంలో మంగళవారం రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నియమం ఉంది. ఈ నివారణలు లేదా ఉపాయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి కోరుకున్న ఫలితాలను పొందుతాడు. అలాగే అన్ని పనుల్లో విజయం సాధిస్తాడు. అటువంటి పరిస్థితిలో మీరు కూడా జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు, విజయం సాధించాలనుకుంటే ఖచ్చితంగా మంగళవారం ఈ 5 చర్యలు చేయండి. అవి ఏమిటో తెలుసుకుందాం..

మంగళవారం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే

  1. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు మంగళవారం రోజున హనుమంతుడిని పూజించి, తమలపాకులు సమర్పించండి. ఈ పరిహారం చేయడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నెరవేరతాయి. విజయాన్ని పొందుతాడు. అలాగే ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి.
  2. జ్యోతిష్యుని ప్రకారం కుజుడు జాతకంలో మొదటి, రెండవ, నాల్గవ, సప్తమ, ఎనిమిది, పన్నెండవ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తికీ కుజ దోషం ఉన్నట్లు చెబుతారు. ఈ సమస్యను పరిష్కరించడం తప్పనిసరి. అదే సమయంలో మంగళ దోషం తగ్గడానికి మంగళవారం ఎండు మిర్చిని దానం చేయాలి. ఎండు మిరపకాయలను దానం చేయడం వల్ల మంగళ్ దోషం ప్రభావం తగ్గుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మంగళవారం రోజున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి సీతారాముల సమేతంగా బజరంగబలిని పూజించాలి. అలాగే పూజ సమయంలో రామరక్షా స్తోత్రాన్ని పఠించాలి. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు పరిష్కరించబడతాయి. ప్రతి పనిలో పురోగతిని పొందుతాడు.
  5. కోరిన కోరిక నెరవేరాలంటే మంగళవారం స్నానం చేసి ధ్యానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించండి. దీని తరువాత హనుమంతుడిని ఆచారాల ప్రకారం పూజించండి. పూజ సమయంలో ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పండ్లు, పువ్వులు సమర్పించండి. సింధూరం కూడా సమర్పించి.. ఆ సిందూరాన్ని నుదుటిపై తిలకంగా దిద్దుకొంది.
  6. తరచుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని కోరుకుం హనుమంతుడికి సంబంధించిన ఈ మంత్రాన్ని మంగళవారం 21 సార్లు జపించాలి. ఈ మంత్రం- ‘ఓం హన్ హనుమతే నమః’. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.

మంగళవారం ఏమి చేయకూడదంటే

వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం అప్పు ఇవ్వకూడదు. పొరపాటున కూడా మంగళవారం రోజున ఎవరి దగ్గరా అప్పులు తీసుకోవద్దని.. అప్పు ఇవ్వొద్దని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో పాటు డబ్బుకు కొరత ఏర్పడుతుంది.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

Follow Us