AP Corona Second Wave : ఏపీలో మళ్లీ మొదలైన కరోనా విజృంభణ, పలు ఆలయాల్లో అన్నదానం నిలిపివేత

AP Corona Second Wave : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి పర్యవసానాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఇప్పటికే ఏడాదంతా వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నమైపోయి..

AP Corona Second Wave :  ఏపీలో మళ్లీ మొదలైన కరోనా విజృంభణ, పలు ఆలయాల్లో అన్నదానం నిలిపివేత
The Sacred Offering Of Food

Updated on: Mar 22, 2021 | 7:39 PM

AP Corona Second Wave : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి పర్యవసానాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఇప్పటికే ఏడాదంతా వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నమైపోయి ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొలిక్కి వస్తున్నవేళ, మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతుండడంతో పరిస్థితి మొదటికొస్తోంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో కరోనా విజృంభణ బెంబేలెత్తిస్తుంటే, తాజాగా ప్రముఖ దేవాలయాలకూ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం నిలిపివేస్తున్నట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఫలితంగా నిన్నటి వరకు పలు ఆలయాల్లో జరిగిన అన్నదానం ఇకపై ఆగిపోనుంది.

ఏపీలోని ప్రముఖ ఆలయాలు ద్వారకా తిరుమల, విజయవాడ ఇంద్రకీలాద్రి, సహా వివిధ ఆలయాల్లో అన్నదానం నిలిపివేయాలని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశించింది. అయితే, భక్తులకు భోజనాన్ని అందించేందుకు దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ఇక మీదట ఆయా ఆలయాల్లో భక్తులకు ప్యాకెట్లలో భోజనం వితరణ ఉంటుంది. భోజనం ప్యాకెట్లలో సాంబారు అన్నం, దద్దోజనం ప్రసాదంగా అందిస్తారు. ఈ అన్నదాన ప్యాకెట్ల కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు పంపిణీ చేస్తారు.

Read also : KTR vs Piyush Goyal : ‘మా సంగతేంటి సారూ’.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వీడియోకి మంత్రి కేటీఆర్ రియాక్షన్