Srirama Navami: శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం.. పోటెత్తిన భక్తులు

|

Apr 10, 2022 | 9:53 AM

Badrachalam-Srirama Navami: శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. చైత్ర శుద్ధ నవమి(Chaitrasuddha Navami) రోజుకి విశిష్ట స్థానం ఉంది. వసంత ఋతువులో..

Srirama Navami: శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం.. పోటెత్తిన భక్తులు
Bhadrachalam Sri Rama Navam
Follow us on

Badrachalam-Srirama Navami: శ్రీరామనవమి పర్వదినాన్ని జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. చైత్ర శుద్ధ నవమి(Chaitrasuddha Navami) రోజుకి విశిష్ట స్థానం ఉంది. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరాముడు జన్మించాడు. చైత్ర శుద్ధ నవమి రోజునే సీతారాముల కళ్యాణం జరిగింది. అంతేకాదు.. ఇదే రోజున శ్రీరాముడు రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. అందుకనే చైత్ర శుద్ధ నవమిని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. రాములోరి కల్యాణానికి భద్రాద్రి అంగరంగ వైభంగా ముస్తాబైంది. శ్రీరామ నవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

రెండేళ్ల తర్వాత మళ్ళీ భక్తుల నడుమ భద్రాచలంలోని  మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మిథిలాస్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తరలిస్తారు. సీతారాముల కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు…పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో…సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. కమనీయమైన కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి తెలుగురాష్ట్రాలలో పాటు, ఛత్తీస్ గడ్, ఒడిశా, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమానివ్వలేదు. ఈ ఏడాది కరోనా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో భక్తులకు అనుమతినిచ్చారు. 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు రామయ్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించనున్నారు. పట్టణంలో రామాలయం పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది.

స్వామివారి కళ్యాణం వీక్షించడానికి సుమారు 2.5లక్షల మంది తరలివస్తారని అంచనావేసిన అధికారులు.. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.  భక్తులకు ఎండదెబ్బ తగలకుండా.. తాగు నీటితో పాటు మజ్జిగ అందిస్తున్నారు. తలాంబ్రాలు, లడ్డూ ప్రసాదాల కోసం పట్టణంలో 24 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ పోలీస్‌ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నీడలో.. సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మిథిలా స్టేడియం వెలుపల నిల్చుని కల్యాణోత్సవం వీక్షించేలా టీవీలు అమర్చారు. స్వామివారి కల్యాణం అనంతరం.. సోమవారం రాములవారి పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read: Sri Ramanavami: సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి.. శోభాయాత్ర సందర్భంగా నేడు భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు