Sri Rama Navami: సిరి సంపదలు, సుఖ సంతోషాల కోసం శ్రీ రామ నవమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..
హిందూ మతంలో శ్రీ రామనవమి పండగకు విశిష్ట స్థానం ఉంది. ఎక్కడున్నాసరే చైత్రశుద్ధ నవమికి పచ్చటిపందిరిలో సీతారాముల కల్యాణం చూసేందుకు చేరుకోవాల్సిందే. ఈ రోజున శ్రీరాముడిని పూజించే సంప్రదాయం మాత్రమే కాదు సీతారాముల కల్యాణం చేస్తారు కూడా. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేసే వారు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ రోజు శ్రీ రామ నవమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకూ జానకీ రాముల కళ్యాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. లోకాభిరాముడు, సుగుణాభిరాలు అయిన శ్రీ సీతా రాముల కళ్యాణమహోత్సవం వీక్షించాలని, శ్రీ సీతా రామచంద్ర ప్రభువుల ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే శ్రీ రామ నవమి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారంగా శ్రీరాముని భావిస్తారు. మానవుడుగా జన్మించి దేవుడిగా మారి పూజలను ఆడుకుంటున్న శ్రీ రాముడి జననాన్ని గుర్తుచేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి జరుపుకుంటారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 6న రామ నవమిని జరుపుకోనున్నారు.
ఈ రోజున దేవాలయాలలో మాత్రమే కాదు గల్లీ గల్లీ లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సీతారాముల కళ్యాణం చేస్తారు. శ్రీరాముని ఊరేగింపు జరుగుతుంది. ఈ రోజున శ్రీరాముడిని పూజించే వారు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం..
శ్రీ రామ నవమి రోజున ఏమి చేయాలంటే
ఉదయాన్నే లేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించండి.
శ్రీరాముని పట్ల భక్తితో చేతులు జోడించి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు