Spiritual Tips: అప్పుల భారంతో అవస్థలు పడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందండి..

Spiritual Tips: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటారు. కానీ, ప్రస్తుత కాలంలో అంత త్వరగా ఎదగడం అనేది సాధ్యమయ్యే పనిలా లేదు. కరోనా సంక్షోభం కారణంగా చాలా మంది..

Spiritual Tips: అప్పుల భారంతో అవస్థలు పడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందండి..
Money

Updated on: Dec 20, 2021 | 7:28 AM

Spiritual Tips: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటారు. కానీ, ప్రస్తుత కాలంలో అంత త్వరగా ఎదగడం అనేది సాధ్యమయ్యే పనిలా లేదు. కరోనా సంక్షోభం కారణంగా చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఆర్థికంగా చతికిల పడటం, వివిధ కారణాల చేత రుణాలు తీసుకుని అప్పులపాలయ్యారు. అయితే, ఇలా అప్పులు తీసుకుని వాటిని తీర్చలేక ఎంతోమంది ఆపసోపాలు పడుతున్నారు. దానికి పరిస్థితులు ఒక కారణమైతే.. వాస్తు, దైవ పరమైనది మరొక కారణం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ అప్పుల కారణంగా వ్యక్తులు మానసికంగా తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తుంటారు. కొందరైతే అప్పుల బాధ తాళలేక మానసిక ఒత్తిడికి గురై.. ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడిన ఘటనలు ఉన్నాయి. క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల వారి కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉంది.

అయితే, మీరు కష్టపడి పని చేస్తున్నప్పటికీ, అప్పుల బాధ వెంటాడుతున్నట్లయితే దానికి జ్యోతిష్య పరమైన పరిహారాలను పాటించవచ్చు. జ్యోతిస్య పరిహారాలను పాటించడం ద్వారా అప్పుల ఊబి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పరిహారాలు ఏంటో.. వాటి ద్వారా రుణ విముక్తి ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మంగళవారం ఇలా చేయండి..
మంగళవారం చేసే పూజలో చాలా శక్తి ఉంటుంది. ప్రతీ మంగళవారం నాడు ఆంజనేయుడి ఆలయానికి వెళ్లి.. హనుమంతుడిని పూజించండి. హనుమంతుని విగ్రహానికి నూనె, చందనం పూయాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి.

శివుని ఆరాధన..
సోమవారం నాడు శివలింగానికి పాలు, నీటితో అభిషేకం చేయాలి. ఆలయంలోనే రిన్ముక్తేశ్వర మంత్రం ‘‘ఓం రిన్‌ముక్తేశ్వర్ మహాదేవాయ నమః’’ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం తప్పనిసరి.

దీన్ని ఆవుకి తినిపించండి..
బుధవారం ఆవుకు ఆహారం పెట్టండి. పప్పును ఉడకబెట్టి, అందులో నెయ్యి కలుపుకుని మీ చేతులతో ఆవుకి తినిపించండి. దీంతో అప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం కూడా ఉంది.

చేపకు మేత..
వారంలో ఏ రోజు అయినా చేపలకు ఆహారాన్ని వేయండి. ఈ చర్య మీలో మానసిక ఒత్తిడిని తగ్గించి, రుణాన్ని తిరిగి చెల్లించే ధైర్యాన్ని కల్పిస్తుంది.

వాస్తు చిట్కా..
మీ ఇంట్లో వాస్తు దోషం లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఈశాన్య కోణాన్ని చక్కగా, శుభ్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు ఉంటుంది, అప్పుల భారం కూడా తగ్గుతుంది.

Also read:

Good Governance Week: నేడు దేశవ్యాప్తంగా సుపరిపాలన వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం..

Income Tax Password: ఆదాయపు పన్ను పోర్టల్‌లో పాస్‌వర్డ్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..