Samatha Kumbh 2025: శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు 108 దివ్యదేశాల పెరుమాళ్లకు శాంతి కల్యాణం..

ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రం ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. ఆరోరోజు శనివారం ఉదయం సుప్రభాత గోష్ఠితో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మార్గనిర్దేశంలో అందరూ ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి జరిగే 108 దివ్యదేశ మూర్తుల శాంతి కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..

Samatha Kumbh 2025: శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు 108 దివ్యదేశాల పెరుమాళ్లకు శాంతి కల్యాణం..
Samatha Kumbh

Updated on: Feb 15, 2025 | 1:40 PM

ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీ రామానుజక్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. సమతాకుంభ్‌ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆరో రోజు ఉదయం సుప్రభాత గోష్ఠితో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. చినజీయర్‌స్వామి మార్గనిర్దేశంలో అందరూ ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు. ఆ తర్వాత అష్టాక్షరీ మంత్రజపంతో పాటు ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. సేవాకాలం, శాత్తుముఱై తర్వాత భక్తులందరికీ స్వామివారు తీర్థం అందజేశారు.

ఆ తర్వాత 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ జరిగింది. గరుడ సేవలో వేంచేసిన 18 మంది పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు జరిగాయి.

కాగా.. సాయంత్రం 5 గంటల నుంచి జరిగే 108 దివ్యదేశ మూర్తుల శాంతి కల్యాణానికి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అంగరంగ వైభవంగా ముస్తాబైంది.

వీడియో..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..