Amaranath Yatra 2022: అమర్‌నాథ్ యాత్రకు ఏర్పాట్లు.. ఏప్రిల్ 11న దేశ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల.. పూర్తి డీటైల్స్ మీ కోసం

Amarnath Yatra 2022: హిందువులు అత్యంత పవిత్రం భావించే అమర్‌నాథ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అమర్ నాథ్ యాత్రను  కోవిడ్ -19 (COVID-19) మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు..

Amaranath Yatra 2022: అమర్‌నాథ్ యాత్రకు ఏర్పాట్లు.. ఏప్రిల్ 11న దేశ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల.. పూర్తి డీటైల్స్ మీ కోసం
Amarnath Yatra 2022

Updated on: Apr 08, 2022 | 2:02 PM

Amarnath Yatra 2022: హిందువులు అత్యంత పవిత్రం భావించే అమర్‌నాథ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అమర్ నాథ్ యాత్రను  కోవిడ్ -19 (COVID-19) మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు వాయిదా వేస్తూ వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల నిరీక్షణకు తెర దించుతూ మళ్ళీ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఈ ఏడాది 2022 జూన్ 30 నుండి ప్రారంభమై ఆగస్టు 11 వ తేదీతో ముగుస్తుందని శ్రీ అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు CEO నితీశ్వర్ కుమార్ గురువారం తెలిపారు. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 11న అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుందని కుమార్‌ తెలిపారు. “అమర్‌నాథ్ యాత్ర 2022 జూన్ 30న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తుంది. రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11న ప్రారంభమవుతుంది. యాత్రికులు పుణ్యక్షేత్రం బోర్డు వెబ్‌సైట్ , మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు” అని కుమార్‌ చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో 3000 మంది యాత్రికులు కూర్చునేందుకు వీలుగా యాత్రి నివాస్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది సుమారు డు లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రానికి వస్తారని బోర్డు అంచనా వేస్తోంది.”యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11 న జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, PNB బ్యాంక్, యెస్ బ్యాంక్ లతో పాటు దేశవ్యాప్తంగా  SBI బ్యాంక్ బ్రాంచ్‌లలో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు. దేశ వ్యాప్తంగా మొత్తం SBI 446 బ్రాంచ్‌లలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని సూచించారు.  మూడు లక్షల మందికి పైగా యాత్రికులు వస్తారని  అంచనా వేసి.. ఆ మేరకు రాంబన్‌, యాత్రి నివాస్ ల్లో వసతి కోసం ఏర్పాటు చేస్తున్నారు. 3000 మంది యాత్రికులు కూర్చునేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు.

అమర్‌నాథ్ యాత్రికులకు ఆర్ఎఫ్ఐడీ ఇస్తామని.. దీని ద్వారా పుణ్యక్షేత్రం బోర్డు యాత్రికులను ట్రాక్ చేయవచ్చనని చెప్పారు.  ఈ ఏడాది యాత్రికుల బీమా వ్యవధి ఒక సంవత్సరం వరకూ పెంచినట్లు.. భీమాను రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెరిగిందని..’ అని వివరించారు.

హిందూ దేవతల్లో శివుడిని హిందువులు మాత్రమే కాదు.. ఇతర దేశాల ప్రజలు కూడా పూజిస్తారు. మంచు లింగం రూపంలో దర్శనం ఇచ్చే శివయ్య దర్శనం కోసం ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు లక్షలాది మంది అమర్‌నాథ్ యాత్రను చేపడతారు. ప్రతి సంవత్సరం వేసవిలో దక్షిణ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రానికి ప్రయాణమవుతారు.  అయితే   COVID-19 మహమ్మారి కారణంగా 2020 , 2021లో అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇక 2019లో కూడా, కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత, ఆగస్ట్ 5కి కొన్ని రోజుల ముందు యాత్ర నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Also Read: Viral Photo: వేసవి నుంచి ప్రయాణీకులకు ఉపశమనం కోసం రిక్షాపై రూఫ్ గార్డెన్.. విదేశీయులు సైతం..ఇతని టాలెంట్‌కు ఫిదా..