కొత్త అయోధ్యలో ఇకపై కర్ఫ్యూ ఉండదని, దానికి బదులుగా భక్తి సంకీర్తనలు, శ్రీరాముడి పేరిట భక్తిగీతాలు వినిపిస్తాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇకపై అయోధ్యలో బుల్లెట్లు పేల్చబోమని, బదులుగా రామభక్తులకు లడ్డూలు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. లక్నోలో హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రియోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రామ్ లల్లా కోసం ట్రస్ట్ చేత నేసిన వస్త్రాలను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ.. శ్రీరాముని నామం ఉచ్ఛరించకుండా మన దేశంలో ఏ పనీ జరగదని అన్నారు.
ఈ నెల 22న అయోధ్యలో నిర్మిస్తున్న ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ఈ ప్రత్యేక వస్త్రాలను ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు.
#WATCH | Lucknow, Uttar Pradesh CM Yogi Adityanath participated in the program of offering clothes made for Lord Ram with the help of more than 12 lakh devotees of Heritage Handweaving Revival Charitable Trust, yesterday in Lucknow. pic.twitter.com/Us9Fs8JxOh
— ANI (@ANI) January 17, 2024
మహారాష్ట్రలోని పుణెకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్టు ‘శ్రీరాముడి కోసం రెండు పోగులు (దో ధాగే శ్రీరామ్‌కే లియే)’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పుణె జిల్లాలోని చేనేత కార్మికులందరూ తలో చెయ్యివేసి ఈ వస్త్రాలు నేశారు. ఆ వస్త్రాలను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా పుణె చారిటబుల్ ట్రస్ట్ బృందాన్ని యోగీ ఆదిత్యనాథ్ అభినందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..