Vaikunta Ekadashi: శ్రీశైలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవం.. భారీగా తరలివచ్చిన తిలకించిన భక్తులు!

Edited By:

Updated on: Dec 30, 2025 | 12:10 PM

నంద్యాల జిల్లా ద్వాదశ జ్యోతిర్లింగం,అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంతి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారికి ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు ఆలయ పూజారులు. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా తరలి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

నంద్యాల జిల్లా ద్వాదశ జ్యోతిర్లింగం,అష్టాదశ శక్తి పీఠం మైన శ్రీశైల మహా క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంతి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారికి ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు ఆలయ పూజారులు. వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ,ప్రాతఃకాలపూజ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఉత్తరద్వార ముఖమండపం నుండి వెలుపలకు తీసుకొచ్చి రావణవాహనంపై అధిష్ఠింపజేసి ఉత్సవ సంకల్పన్ని పఠనించి ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం రావణవాహనోత్సవపై క్షేత్ర పురవీధుల్లో స్వామి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అలానే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం ముఖమండపం వెలుపల ఆశీనులను చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీ తరలివచ్చిన భక్తులు శ్రీస్వామి అమ్మవారిని ఉత్తరద్వారా దర్శనం ద్వారా దర్శించుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుండి శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించారు.

మరిన్ని అథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.