Success Mantra: శత్రువులను కూడా మిత్రుడిగా మార్చే సేవాగుణం.. దీనికి సంబంధించిన 5 సింపుల్ కొటేషన్స్ మీ కోసం

|

Dec 26, 2022 | 2:54 PM

సేవ అనేది మనిషి ప్రాథమిక స్వభావం.. ఇలా సేవ చేసేవారు తాము సంతోషంగా, సుసంపన్నంగా.. సంతృప్తిగా ఉన్నారని చెబుతారు. సేవ చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం మాత్రమే కాదు.. అంతిమంగా సంతృప్తిని పొందగలరు.

Success Mantra: శత్రువులను కూడా మిత్రుడిగా మార్చే సేవాగుణం.. దీనికి సంబంధించిన 5 సింపుల్ కొటేషన్స్ మీ కోసం
Positive Thoughts On Service
Follow us on

బలహీనమైన, నిస్సహాయ, బాధల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం లేదా సేవ చేయడం మానవ ధర్మం. మనమందరం కొన్నిసార్లు ఎవరికైనా లేదా మరొకరికి ఏదో ఒక విధంగా సేవ చేస్తాం. అయితే చాలాసార్లు ఎవరికి..  ఎలా సేవ చేయాలనే ప్రశ్న ప్రజల మనస్సులో వస్తుంది. ఒకరికి సేవ చేసే అసలు మార్గం ఏమిటి.. సేవ చేయడానికి డబ్బు చాలా ముఖ్యమా లేక డబ్బు ద్వారా చేసే సేవనే అతి పెద్ద సేవ అని చెప్పాలా? మానవాళికి చేసే సేవను దేవుని సేవ అని ఎందుకు అంటారు? ఈ ప్రశ్నలన్నింటికీ సన్యాసులు, మహాపురుషుల నుండి మనకు లభించే సమాధానాలు, వాటిలోని సారాంశం తెలుస్తుంది. సేవ అనేది మనిషి ప్రాథమిక స్వభావం.. ఇలా సేవ చేసేవారు తాము సంతోషంగా, సుసంపన్నంగా.. సంతృప్తిగా ఉన్నారని చెబుతారు. సేవ చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం మాత్రమే కాదు.. అంతిమంగా సంతృప్తిని పొందగలరు. సేవ చేయడానికి డబ్బు అవసరం కావచ్చు.. అయితే అవసరం సమయంలో సేవ చేయడానికి .. డబ్బుమాత్రమే అవసరం కాదు.. నిజమైన స్ఫూర్తితో చేసే సేవే నిజమైన సేవ. సేవకు సంబంధించిన 5 ప్రేరణాత్మక కొటేషన్స్ గురించి తెలుసుకుందాం..

  1. సేవ అనేది మనిషి సహజ స్వభావం. సేవే మానవ జీవితానికి ఆధారం. మానవాళికి సేవ చేయడం కంటే మెరుగైన పని లేదు.
  2. సేవ హృదయాన్ని ..  ఆత్మను శుద్ధి చేస్తుంది. సేవ ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఇది మానవ జీవితానికి నిజమైన లక్ష్యం.
  3. బలహీనమైన, జబ్బుపడిన… బాధల్లో,  విచారంగా ఉన్న వ్యక్తికి సహాయం చేయడం..  సేవ చేయడం మనిషి ప్రధాన కర్తవ్యం. ఆపన్నులకు సేవ చేయాలంటే.. డబ్బు అవసరం లేదు. సంకుచిత జీవితాన్ని వదిలి పదిమందితో కలిసి జీవితంలో ముందుకు సాగాలి.
  4. జీవితంలో అత్యుత్తమమనది సేవ అంటారు.  మీరు ఎవరికైనా సహాయం చేస్తే.. అతను తిరిగి మీకు కృతజ్ఞతలు ఒకొక్కసారి చెప్పలేడు.
  5. ఇవి కూడా చదవండి
  6. సేవ అనేది జీవితాంతం పరస్పర ప్రేమ ..  నమ్మకంతో చేయాల్సిన పని. సేవ చేసేవారికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా పెద్దగా అవి అతని జీవితంపై ప్రభావం చూపించవు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)