Lord Shiva: సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు.. ఈ రోజు శివారాధన చేస్తే అద్భుత ప్రయోజనాలు..

|

Aug 23, 2021 | 11:52 AM

Lord Shiva: సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు శివారాధన చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Lord Shiva: సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు.. ఈ రోజు శివారాధన చేస్తే అద్భుత ప్రయోజనాలు..
Lord Shiva
Follow us on

Lord Shiva: సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు శివారాధన చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శివపూజ చాలా సులభం. ఆయనను ఏ విధంగా ఆరాధించినా కరుణిస్తాడు. అందుకే బోళా శంకరుడు అంటారు. అతడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. శివుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

శివుడు కుబేరుని పాలకుడు అందుకే శివుడిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. శివుడిని ఆరాధించిన వ్యక్తికి జీవితంలో ఏ ఆర్థిక సమస్య ఉండదంటారు. శివుడు అదృష్టవంతుడు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వ్యక్తులు అదృష్టం పొందడానికి తప్పనిసరిగా శివుడిని ఆరాధించాలి. మీకు తెలియని శత్రువుతో అపాయం ఉంటే ప్రతిరోజు శివారాధన చేస్తే మంచిది. శివుడిని ఆరాధించడం వల్ల కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది.

ఉసిరికాయలతో చేస్తే మోక్షం, సువర్ణం పొడిగా చేసి అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తాయట. అష్టదాతువులతో చేసే అభిషేకం వల్ల సిద్ధి, మణులు, వాటి పొడులతో అభిషేకిస్తే అహంకారం తొలగిపోతాయట. పాదరసంతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయట. చెరకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం వుండదు, యమభయం వుండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది.

శివారాధన చేయడం వల్ల మరికొన్ని లాభాలు..

1. సోమవారం పంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
2. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది.
3. సోమవారం పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది.
4. నవధాన్యాలతో ఆరాధిస్తే ధనంతోపాటు భార్యాపుత్రలాభం, పటికబెల్లంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తాయట.
5. ఉప్పుతో అభిషేకం చేస్తే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదాభిషేకంతో సర్వకార్యాలు ప్రాప్తిస్తాయి.

మొరిపిరాల లవ్ చీటింగ్ కేసులో కొత్త కోణాలు.. సందీప్ కుమార్‌ను బలితీసుకున్న హానీ ట్రాప్.!

మొరిపిరాల లవ్ చీటింగ్ కేసులో కొత్త కోణాలు.. సందీప్ కుమార్‌ను బలితీసుకున్న హానీ ట్రాప్.!

Corona 3rd wave: భారత్​లో కరోనా థర్డ్ వేవ్‌పై కేంద్రానికి కీలక నివేదిక.. ముప్పు అతి సమీపంలోనే