Mohini Ekadashi 2025: మోహినీ ఏకాదశి పూజ నియమాలు? ఏమి చేయాలి? ఏమి చేయకూడదంటే..

వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం పాటించడం ద్వారా జీవితంలో సంపద, వైభవం, ఆనందం , శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం. ఉపవాసం ప్రయోజనాలను పొందడానికి ఏకాదశి నియమాలను పాటించడం అవసరం. కనుక ఈ రోజు ఈ ఉపవాసానికి సంబంధించిన నియమాలను గురించి తెలుసుకుందాం..

Mohini Ekadashi 2025: మోహినీ ఏకాదశి పూజ నియమాలు? ఏమి చేయాలి? ఏమి చేయకూడదంటే..
Mohini Ekadashi

Updated on: May 04, 2025 | 3:28 PM

ఏకాదశి ఉపవాసం ప్రతి నెలా శుక్ల, కృష్ణ పక్ష ఏకాదశి తిథిలో ఆచరిస్తారు. అంటే ఏకాదశి తిధి నెలకు రెండుసార్లు అంటే ఏడాదిలో 24 సార్లు వస్తుంది. ఈ ప్రతి ఏకాదశి తిధికి ఒకొక్క విశిష్ట ఉంది. అందులో వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువుకి సంబంధించిన మోహిని రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున ఆచారాలతో పూజ చేసే ఉపవాసాలు పాటించడం ద్వారా విష్ణువు, లక్ష్మి దేవిల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.

మోహిని ఏకాదశి తేదీ

వేద క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి మే 7న ఉదయం 10:19 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు అంటే మే 8న మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి నమ్మకం ప్రకారం మోహిని ఏకాదశి ఉపవాసం మే 8న పాటిస్తారు.

మోహిని ఏకాదశి నాడు ఏమి చేయాలి?

  1. మోహిని ఏకాదశి రోజున విష్ణువు అవతారమైన మోహినిదేవిని పూజిస్తారు. అలాగే శ్రీ హరికి గంధపు తిలకం సమర్పించండి. తులసి దళాలను సమర్పించండి.
  2. పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఎందుకంటే మోహినికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం.
  3. ఇవి కూడా చదవండి
  4. మోహిని ఏకాదశి ఉపవాసం పాటించేవారు సాత్వికంగా ఉండాలి. ముందు రోజు నుంచి అంటే దశమి తిథి నుంచే సాత్విక ఆహారాన్ని తినాలి.
  5. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆవును సేవించండి. వాటికి పచ్చి గడ్డిని ఆహారంగా అందించండి.
  6. మోహిని ఏకాదశి రోజున పూజ తర్వాత, తమ శక్తి మేరకు ధాన్యాలు, బెల్లం, డబ్బు దానం చేయాలి.

మోహిని ఏకాదశి నాడు ఏమి చేయకూడదంటే

  1. మోహిని ఏకాదశి నాడు విష్ణువు పూజలో తులసి దళాలను సమర్పించాలి. అయితే సమర్పించండి. అయితే ఈ రోజున తులసి మొక్కని తాకవద్దు.
  2. తులసి ఆకులను తెంపవద్దు లేదా తులసి మొక్కకు నీరు పెట్టవద్దు.
  3. ఏకాదశి రోజున తామసిక ఆహారం తీసుకోకూడదు. అన్నం కూడా తినకూడదు.
  4. అంతేకాదు ఏకాదశి రోజున నల్లని బట్టలు కూడా ధరించకూడదు.
  5. స్త్రీలను, వృద్ధులను అవమానించకూడదు.
  6. మనసులో ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us