Makara Jyothi: స్వామియే శరణం అయ్యప్ప.. మకరజ్యోతి దర్శనంతో పులకించిన భక్తులు.. వీడియో

|

Jan 14, 2025 | 6:59 PM

శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగుతున్న వేళ.. మకరవిళక్కు.. మకర జ్యోతి దర్శనంతో భక్తకోటి తరించింది. మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల పొన్నాంబలమేడుపై మకర జ్యోతి కనిపించింది. అయ్యప్ప స్వాములు ఎంతో భక్తితో దర్శించుకునే మకర జ్యోతిని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు.

Makara Jyothi: స్వామియే శరణం అయ్యప్ప.. మకరజ్యోతి దర్శనంతో పులకించిన భక్తులు.. వీడియో
Ayyappa Swamy
Follow us on

శబరిగిరులు శరణుఘోషతో పులకిస్తున్నాయి. అయ్యప్ప నామస్మరణతో లక్షలాది భక్తుల హృదయాలు పరవశిస్తున్నాయి. మండలకాలం పాటు దీక్ష చేసి.. ఇరుముడి కట్టుకుని.. శబరిమలకు చేరుకున్నారు భక్తులు. పంబలో స్నానం చేసి..సన్నిధానం చేరుకుని.. మణికంఠుని దర్శనం కోసం..మకర జ్యోతి దివ్యానుభూతి కోసం ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.. శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగుతున్న వేళ.. మకరవిళక్కు.. మకర జ్యోతి దర్శనంతో భక్తకోటి తరించింది. మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల పొన్నాంబలమేడుపై మకర జ్యోతి కనిపించింది. ఎంతో భక్తితో దర్శించుకునే మకర జ్యోతిని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు, మాలధారులు వచ్చారు. మంగళవారం సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. లక్షలాది మంది భక్తులు, మాలధారులు మకర జ్యోతిని దర్శించుకుని.. దివ్యానుభూతిని పొందారు.. జ్యోతి దర్శనంతో భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు. శబరిగిరులు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడాయి. మకర సంక్రాంతి పర్వదినాన జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారని భక్తులు నమ్ముతారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం…

వీడియో చూడండి..

మూడే రోజుల ముందు నుంచి..

అంతకుముందు పందళరాజ వంశీయులు మణికంఠునికి స్వర్ణాభరణాలతో కాలినడకన శబరిమలకు వచ్చారు.. వలియకొయిక్కల్‌ శ్రీధర్మశాస్త ఆలయం నుంచి 12 మంది పందళరాజ వంశీయులు తిరువాభరణాలతో కూడిన మూడు పెట్టెలను శిరస్సున ధరించి.. వడివడిగా అడుగులు వేసుకుంటూ.. సన్నిధానం వచ్చారు.. మూడురోజుల ఈ తిరువాభరణం ఊరేగింపు యాత్రను 15మంది సభ్యుల ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బృందం కోఆర్డినేట్‌ చేసింది. ఈ సాయంత్రం తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకున్నారు.. శబరిమల ఆలయ ప్రధాన తంత్రి వారికి స్వాగతం పలికి..వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరించారు.. అనంతరం పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిచ్చింది.. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి..ఇరుముడి సమర్పించి..ధన్యోహం ఓ శబరీశా అంటూ మాటలకందని ఆధ్యాత్మికానందాన్ని పొందారు స్వాములు..

లక్షలాది భక్తుల ఆశ, శ్వాస అయ్యప్ప!

లక్షలాది భక్తుల ఆశ, శ్వాస అయ్యప్ప! మకరజ్యోతి దర్శనమే వారి దీక్షకు పరమార్థంగా భావిస్తారు. సూర్యస్తమయం తరువాత మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి..ఇరుముడి సమర్పించి..ధన్యోహం ఓ శబరీశా అంటూ మాటలకందని ఆధ్యాత్మికానందాన్ని పొందారు స్వాములు..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..