ఆలయ పూజారి అద్భుతం..చేతులతో ‘గుడి ప్రదక్షిణ’

|

Jun 22, 2020 | 5:40 PM

ఒక్కో వ్యక్తిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మాత్రమే వారి సత్తా బయటపడుతుంది. ఎప్పుడూ దేవుడి సన్నిధిలోనే ఉంటూ, భగవంతుడికి నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించే ఓ పూజారి తనలోని టాలెంట్‌ని బయటపెట్టాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం

ఆలయ పూజారి అద్భుతం..చేతులతో ‘గుడి ప్రదక్షిణ’
Follow us on

ఒక్కో వ్యక్తిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మాత్రమే వారి సత్తా బయటపడుతుంది. ఎప్పుడూ దేవుడి సన్నిధిలోనే ఉంటూ, భగవంతుడికి నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించే ఓ పూజారి తనలోని టాలెంట్‌ని బయటపెట్టాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం కేదరనాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది.. గుడి చుట్టూ కొత్తరకంగా ప్రదక్షిణ చేశారు. ఆదివారం జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సంతోష్ త్రివేది చేతులపై ప్రదక్షిణలు చేశారు.

చేతులతో..తలకిందులుగా నడుస్తూ..కేదార్ నాథ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, యోగ సాధన ద్వారానే ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు. మనసు పెట్టి యోగాచేస్తే..చేతులతో నడవొచ్చు..నీటిలో తేలొచ్చు..గాలిలోనే కూర్చోవచ్చునని యోగా సాధకులు చెబుతున్నారు. యోగా ద్వారానే శరీరానికి, మనసుకు మంచి ఆరోగ్యం సమకూరుతుందని చెబుతున్నారు. కాగా, పూజారి సంతోష్ త్రివేది చేతులతో చేసిన ఆలయ ప్రదక్షిణ వీడియో, ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌ అవుతున్నాయి.