IRCTC: హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర టూర్.. అజంతా, ఎల్లోరా సందర్శనకు 4 రోజుల ప్యాకేజీ.. ధర ఎంతంటే?

IRCTC Maharashtra Tour Package Telugu: హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహలు, గ్రిష్ణేశ్వర్ ఆలయం, బీబీ కా మక్బరాను సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 3 రాత్రులు, 4 రోజుల ఈ ప్యాకేజీ ధరలు, ప్రయాణ వివరాలు తెలుసుకుందాం.

IRCTC: హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర టూర్.. అజంతా, ఎల్లోరా సందర్శనకు 4 రోజుల ప్యాకేజీ.. ధర ఎంతంటే?
Irctc Maharashtra Tour Package Telugu

Updated on: Sep 25, 2026 | 9:48 PM

IRCTC Maharashtra Tour Package Telugu: మహారాష్ట్రలోని చారిత్రక కట్టడాలు, ప్రాచీన గుహలు, ప్రసిద్ధ ఆలయాలను సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ‘Marvels of Maharashtra’ (SHR105) పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో సంభాజీనగర్, ఎల్లోరా, అజంతా ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి రైలు ప్రయాణంతో ఈ టూర్ ప్రారంభమవుతుంది.

టూర్ వివరాలు

ఈ ప్యాకేజీ 3 రాత్రులు/4 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6:30 గంటలకు రైలు బయలుదేరుతుంది. 17064 అజంతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఉంటుంది. శనివారం ఉదయం 5:25 గంటలకు ఛత్రపతి సంభాజీనగర్ చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు తరలించి అల్పాహారం అందిస్తారు. అనంతరం ప్రసిద్ధ ఎల్లోరా గుహలు, గ్రిష్ణేశ్వర్ ఆలయం సందర్శిస్తారు. సాయంత్రం చారిత్రక బీబీ కా మక్బరాను వీక్షించి సంభాజీనగర్‌లో రాత్రి బస చేస్తారు.

ఆదివారం ఉదయం అల్పాహారం అనంతరం హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని అజంతా గుహలకు బయలుదేరుతారు. అజంతా గుహలను సందర్శించిన తర్వాత సాయంత్రం సంభాజీనగర్‌కు తిరిగి వచ్చి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 10:45 గంటలకు 17063 రైలులో కాచిగూడకు బయలుదేరుతారు. సోమవారం ఉదయం 9:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్యాకేజీ ధరలు

జూలై 2026 నుంచి అమల్లో ఉన్న ధరల ప్రకారం 1 నుంచి 3 మంది ప్రయాణికులకు కంఫర్ట్ (3AC) సింగిల్ షేరింగ్ ₹22,730, ట్విన్ షేరింగ్ ₹13,340, ట్రిపుల్ షేరింగ్ ₹10,700 నుంచి ఉన్నాయి. స్టాండర్డ్ (SL)లో సింగిల్ ₹21,230, ట్విన్ ₹11,830, ట్రిపుల్ ₹9,200 నుంచి ధరలు ఉన్నాయి.

4 నుంచి 6 మంది ప్రయాణికులకు కంఫర్ట్ ట్విన్ షేరింగ్ ₹10,810, ట్రిపుల్ ₹10,150 కాగా, స్టాండర్డ్‌లో ట్విన్ ₹9,310, ట్రిపుల్ ₹8,640 నుంచి ఉన్నాయి. 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో, బెడ్ లేకుండా ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, ఏసీ వాహనం, ఒక రాత్రి హోటల్ వసతి, రెండు బ్రేక్‌ఫాస్ట్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, సందర్శనా ప్రదేశాలకు రవాణా, టోల్, పార్కింగ్, జీఎస్టీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అయితే లంచ్, డిన్నర్, రైలులో ఆహారం, ప్రవేశ టికెట్లు, టూర్ గైడ్, అదనపు వినోద కార్యక్రమాల ఖర్చులు ప్యాకేజీలో ఉండవు.

సంభాజీనగర్‌లో Enrise By Sayyaji లేదా సమానమైన హోటల్లో వసతి కల్పిస్తారు. మొత్తం ప్యాకేజీలో కంఫర్ట్ విభాగంలో 6 సీట్లు, స్టాండర్డ్ విభాగంలో 16 సీట్ల సామర్థ్యం ఉంది. ప్రయాణ తేదీలకు అనుగుణంగా సీట్ల లభ్యత, హోటల్ చెక్-ఇన్, రైలు బెర్త్ కేటాయింపు వంటి నిబంధనలు వర్తిస్తాయి.

IRCTC MARVELS OF MAHARASHTRA (SHR105) టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us