Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ ఉండాల్సిందే ఇక్కడే.. ధనరాశులు కురవాలంటే ఈ తప్పులు చేయొద్దు..

ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే సంపద, శ్రేయస్సు వస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను సరైన దిశలో, సరైన విధంగా పెంచితేనే సానుకూల ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయం లేదా వాయువ్యం దిశల్లో మాత్రమే మనీ ప్లాంట్‌ను ఉంచాలని, ఈశాన్యం లేదా నైరుతి దిశల్లో పెంచడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చని సూచిస్తున్నారు.

Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ ఉండాల్సిందే ఇక్కడే.. ధనరాశులు కురవాలంటే ఈ తప్పులు చేయొద్దు..
Money Plant Vastu Tips

Updated on: Jun 01, 2026 | 4:39 PM

మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే సంపద వస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు. అయితే, ఈ మొక్క ఆర్థిక శ్రేయస్సును చేకూర్చాలంటే దానిని పెంచడంలో కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య పండితులు, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ సరైన దిక్కున, సరైన పద్ధతిలో పెంచితేనే ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని.. ఇంట్లో మనశ్శాంతి లభిస్తుందని పేర్కొంటున్నారు. వాస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం.. మనీప్లాంట్ అదృష్టం, సానుకూల శక్తిని తెస్తుందని.. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. అయితే.. మనీ ప్లాంట్ ను పెంచడానికి ఆగ్నేయం (వంటగది మూల), వాయువ్యం అనే రెండు దిక్కులు మాత్రమే అనుకూలమైనవి. ఈశాన్యం, నైరుతి లేదా ఇతర ఏ దిశలో పెంచినా ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. తప్పుడు దిక్కులలో పెంచడం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక నష్టాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, మనీ ప్లాంట్ ను ఆగ్నేయం లేదా వాయువ్యం దిశలలో మాత్రమే పెంచాలి.

మనీ ప్లాంట్ ను పెంచే విధానంలో కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దీనిని ఎల్లప్పుడూ ఎర్రటి రంగు కుండీలో లేదా ఎర్రటి సీసాలో (నీటిలో పెంచినట్లయితే) పెట్టాలి. ఎర్రటి రంగు పాత్ర దాని శక్తిని మరింత పెంచుతుందని నమ్ముతారు. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, మనీ ప్లాంట్ కాండం ఎల్లప్పుడూ పైకి ఎదగాలి. దానిని ఆధారంగా పెట్టి పైకి పాకించాలి. చాలామంది హ్యాంగింగ్ పాట్స్ లో పెంచి, మొక్క కిందకు వేలాడేలా చేస్తారు. అయితే, కిందకు వేలాడే విధంగా పెంచడం వల్ల ఆర్థిక నష్టాలు, దురదృష్టం కలుగుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. పైకి ఎదిగే మనీ ప్లాంట్ డబ్బును, అవకాశాలను ఆకర్షిస్తుందని, కిందకు వాలినది డబ్బును పడిపోయేలా చేస్తుందని వివరిస్తున్నారు.

మనీ ప్లాంట్ ఒక పరాన్నభుక్తం. అంటే ఇది ఇతర మొక్కల నుండి లేదా పరిసరాల నుండి శక్తిని గ్రహించి పెరుగుతుంది. దీనివల్ల అది పెరిగే ప్రదేశంలోని శక్తిని, అది సానుకూలమైనా లేదా ప్రతికూలమైనా, గ్రహించి మరింత బలంగా మారుతుంది. సరైన దిక్కులలో పెంచడం ద్వారా ఇది సానుకూల శక్తిని, సంపదను ఆకర్షించి మనకు మేలు చేస్తుంది. ఒకవేళ బలమైన చెట్టుకు పాకించాలనుకుంటే, ఆగ్నేయం లేదా వాయువ్యం దిశలలో ఉన్న బలమైన చెట్టుకు పాకించడం శ్రేయస్కరం.

తప్పుడు దిక్కులలో పెంచిన మనీ ప్లాంట్ తీవ్రమైన ఆర్థిక సమస్యలను, కుటుంబంలో కలహాలను సృష్టిస్తుందని ఆమె స్పష్టం చేశారు. కాబట్టి, మనీ ప్లాంట్ ను పెంచేటప్పుడు పైన చెప్పిన వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ నియమాలను పాటించడం వల్ల ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆర్థిక వనరులు ఏర్పడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నియమాలు పాటించలేని పక్షంలో, మనీ ప్లాంట్ ను పెంచకుండా ఉండటమే మంచిదంటున్నారు వాస్తుశాస్త్రం నిపుణులు..

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us