భారతీయుల జీవితాలను, వాస్తును వేరు చేసి చూడలేము. అంతలా మన జీవితాల్లో వాస్తు ఓ భాగమైపోయింది. అందుకే సొంతింటి నిర్మాణమే కాకుండా అద్దెకు ఉండే ఇంటికి కూడా వాస్తును చూసుకుంటుంటారు. అద్దె ఎక్కువయినా పర్లేదు వాస్తు మాత్రం పకడ్బందీగా ఉండాలని చాలా మంది భావిస్తుంటారు.
ఇక కేవలం ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో ఉండే వస్తువులపై కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా వాస్తు ఇంపాక్ట్ ఉంటుంది. మనకు తెలిసో, తెలియకో చేసే కొన్ని తప్పుల కారణంగా ఇంట్లో ఉండే వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి వాస్తు దోషాల కారణంగా ఇంట్లో మానసిక సంతోషం దూరమవుతుంది.? ప్రశాంతమైన జీవితం సొంతమవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇప్పుడు చూద్దాం..
* ఇంట్లో ఆగ్నేయ దిశ ఎట్టి పరిస్థితుల్లో మిగతా దిక్కులంటే ఎక్కువంగా ఉండకుండా చూసుకోవాలి. పొరపాటున కూడా ఇంట్లో ఇలా ఉంటే కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడకతప్పదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
* ఇంటికి ఆగ్నేయ దిశలో ఎట్టి పరిస్థితుల్లో బావి ఉండకూడదు. అలాగే ఈ దిశలో నీరు కూడా నిల్వ ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉంటే ఇంట్లో ఖర్చులు పెరగడంతో పాటు అప్పులు ఎక్కువవుతాయి.
* ఇంటి ఈశాన్యం దిశలో ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. ఈశాన్యం దిశలో ఖాళీ స్థలం లేకపోతే ఇంట్లో మానసిక ప్రశాంతత దెబ్బ తింటుంది. ఈశాన్యం దిశలో వాస్తు పరిహారం కోసం స్వస్విక్ లేదా ఓం చిహ్నాలను ఏర్పాటు చేస్తే మార్పు ఉంటుంది.
* నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో తలుపు ఉండకూడదు. ఒక తలుపు మరొక తలుపు ఎదురెదురు కూడా ఉండకూడదు. ఇలా ఉంటే ఇంట్లో వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
* ఇక ఇంటికి తూర్పు దిశలో ఎట్టి పరిస్థితుల్లో చెత్త కుప్పలు లేకుండా చూసుకోవాలి. ఈ దిశలో చెత్త ఉంటే దరిద్రం వెంటాడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
* ఇంటికి దక్షిణ దిశలో బోర్‌వెల్ లేదా నీటి వనరు ఉండకకుండా చూసుకోవాలి. ఇంట్లో బోర్ కచ్చితంగా ఈశాన్యం దిశలోనే ఉండాలి.
* ఉత్తర దిశ కంటే దక్షిణ దిశలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండకూడదు. ఈ వాస్తు దోషం కారణంగా ఇంటి యజమానికి వయసు ప్రభావ సమస్యలు తప్పవని వాస్తు పండితులు చెబుతున్నారు.
* ఇక ఇంటికి నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో తలుపు లేకుండా చూసుకోండి. అది ప్రమాదానికి సూచన. మరీ ముఖ్యంగా గేటు, ప్రధాన ద్వారం అస్సలు ఉండకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..