
దీపావళి హిందువుల అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజించి, ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. పండుగ రోజున సాయంత్రం 5:54 నుండి రాత్రి 7:50 వరకు దీపాలు వెలిగించడానికి, పూజ చేయడానికి అత్యంత శుభకరమైన సమయంగా భావిస్తారు. ఇళ్లలోని ప్రతి మూల వెలుగులతో నిండిపోవాలని, లక్ష్మీదేవి కటాక్షం కలగాలని అందరూ ఈ దీపోత్సవాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే, దీపావళి రోజు రాత్రి ఎన్ని దీపాలు వెలిగించాలి? పూజకు సరైన సమయం తెలుసుకోండి..
నమ్మకాల ప్రకారం, దీపావళి రాత్రి లక్ష్మీదేవి స్వయంగా భూమిపై సంచరిస్తుందని, ఎక్కడైతే పరిశుభ్రత, దివ్యమైన దీపాల కాంతి ఉంటుందో అక్కడ ఆమె శాశ్వతంగా నివసిస్తుందని ప్రతీతి. అందుకే సాయంత్రం వేళ విధివిధానంగా లక్ష్మీ పూజ ముగిసిన తర్వాత, ఇంటి ప్రధాన ద్వారం నుండి ప్రతి మూలన దీపాలు వెలిగిస్తారు. ఈ ఏడాది దీపావళి నాడు దీపాలు వెలిగించడానికి సాయంత్రం 5:54 గంటల నుంచి రాత్రి 7:50 గంటల వరకు అత్యంత శుభ ముహూర్తంగా నిర్ణయించబడింది. అలాగే ప్రదోష కాలం సాయంత్రం 5:31 నుండి రాత్రి 8:09 గంటల వరకు ఉంటుంది.
దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలనే దానిపై ఎలాంటి కచ్చితమైన నిబంధన లేదు. భక్తులు తమ ఆచారం, శక్తి కొద్దీ 5, 11, 21, 51 లేదా 108 దీపాలను వెలిగించవచ్చు. ఈ రోజున రెండు పెద్ద దీపాలను ప్రత్యేకంగా ఉంచడం విశేషం. వాటిలో మొదటిది ఆవు నెయ్యితో చేసిన దీపం కాగా, ఇది రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది. రెండవది నువ్వుల నూనె లేదా ఆవనూనెతో వెలిగించే దీపం.
లక్ష్మీ పూజ కోసం సాయంత్రం 5:54 నుండి రాత్రి 7:50 గంటల వరకు గల సమయం ఎంతో ఉత్తమమైనది. వృషభ లగ్నం కూడా ఇదే సమయంలో ఉండటం విశేషం. వ్యాపారస్తులు, గృహస్తులు ఈ ముహూర్తంలో పూజలు చేసి తమ ఇళ్లలో సిరిసంపదలు వర్ధిల్లాలని కోరుకుంటారు. దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను దీపాలతో అలంకరించి, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకుంటారు. ఈ పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగులను, సుఖశాంతులను తీసుకురావాలని అందరూ కోరుకుంటారు.
Note: వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.