Diwali 2021: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ‘దీపావళి’ని ఇలా జరుపుకోండి..

|

Oct 26, 2021 | 10:57 PM

Diwali 2021: కరోనా కాలంలో ఆరోగ్యం, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా దీపావళి పండుగ సందర్భంగా సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. సురక్షితమైన దీపావళిని ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
సామాజిక దూరాన్ని పాటించండి. దీపావళి పర్వదినం వేళ సామాజిక దూరాన్ని పాటించడం చాలా ముఖ్యం. కరోనా వైరస్ థర్డ్ వేవ్‌ను విస్మరించలేం. అలాంటి పరిస్థితిలో వ్యక్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. రద్దీ ప్రదేశాలలో తిరగడం మానుకోవడం మరింత ఉత్తమం.

2 / 5
కొవ్వొత్తి, దీపం వెలిగించే ముందు శానిటైజర్‌ని ఉపయోగించడం మానుకోండి. ముఖ్యంగా కొవ్వొత్తి, దీపం వెలిగించేటప్పుడు ఆల్కహాల్ కలిగిన శానిటైజర్‌ను ఉపయోగించకుండా ఉండాలి. శానిటైజర్‌లలో మండే స్వభావం ఉంది. అందుకే శానిటైజర్ రాసుకుని మంట వద్దకు వెళితే.. అంటుకునే ప్రమాదం ఉంది. కొవ్వొత్తి, దీపం వెలిగించే ముందు ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

3 / 5
మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. చుట్టాలు, తెలిసిన వారు అయినా సరే.. జనాబాహుళ్యంలో తిరుగుతున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోండి. మాస్క్ ధరించి.. సురక్షితంగా ఉండండి.

4 / 5
సరైన దుస్తులు ధరించాలి. చాలా మంది ప్రజలు దీపావళి పండుగ సమయంలో ట్రెండింగ్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. అదే సమయంలో సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. చాలామంది షిఫాన్, జార్జెట్, శాటిన్, సిల్క్ బట్టలు ఎక్కువగా ధరిస్తారు. కానీ అలాంటి దుస్తులు వెంటనే నిప్పు అంటుకోవడానికి అస్కారం కలిగిస్తాయి. అందుకే వీటికి బదులుగా.. పట్టు, నూలు, జనపనార బట్టలను ఎంచుకోవడం ఉత్తమం.

5 / 5
టపాసులకు దూరంగా ఉండండి. దీపావళి సందర్భంగా చాలా మంది క్రాకర్లు కాలుస్తారు. క్రాకర్ల ద్వారా వెలువడే పొగ ప్రజలకు తీవ్ర హానీ తలపెడుతుంది. కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. క్రాక్టర్ వల్ల కోవిడ్ సోకిన రోగుల పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు పటాకులు కాల్చకుండా ఉండేందుకు ట్రై చేయండి.