Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. వరస సెలవులతో శ్రీ క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 10గం. సమయం..

వరుసగా సెలవులు రావటం సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. క్షేత్ర మంతా భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది.

Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. వరస సెలవులతో శ్రీ క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 10గం. సమయం..
Srisailam Devotees Rush

Edited By:

Updated on: Oct 02, 2023 | 9:40 AM

వీకెండ్ వరస సెలవులతో పాటు గాంధీ జయంతి కూడా రావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తుల రద్దీతో నిండిపోతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల నెలకొంది.  భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వరుసగా సెలవులు రావటంతో పాటు పైగా సోమవారం కావడంతో భారీగా భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. భక్తులు రద్దీ పెరిగి పోతుండడంతో మల్లన్న స్వామి అమ్మవార్ల దర్శనానికి 10 గంటలు సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు.
వరుసగా సెలవులు రావటం సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. క్షేత్ర మంతా భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది.
భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. వరుసగా సెలవలు కావడంతో క్షేత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
Loading...
Unable to load recommendations.
Follow Us