యువత, తమ యవ్వన దశలో అనేక చెడు అలవాట్లను అలవర్చుకుంటారు. దీని వల్ల తమ లక్ష్యాల నుంచి దూరమవడమే కాకుండా.. మానసిక వత్తడికి లోనవుతుంటారు. అందుకే ఇలాంటి దురలవాట్ల నుంచి బయటపడేందుకు ఆచార్య చాణక్య పలు సూచనలు చేశారు.
ఆత్మవిశ్వాసం: చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల జీవితంలో విజయం సాధించలేరు. మీరు ఎంత ప్రతిభావంతులైనప్పటికీ, సమర్థులైనప్పటికీ ఆత్మ విశ్వాసం లేకపోతే జీవితంలో విజయం సాధించలేరు.
క్రమశిక్షణ: చాణక్య నీతి ప్రకారం యువతలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ కలిగిన యువత జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. క్రమశిక్షణ కలిగిన యువకులు.. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. కాబట్టి యువత ముఖ్యంగా కఠినమైన క్రమశిక్షణ పాటించాలి.
వ్యసనాలకు బానిస అవ్వొద్దు: చాలా మంది యువతీ, యువకులు చెడు అలవాట్లకు బానిసవుతారు. ఇది వారి జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల డబ్బు వృథా కావడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి చెడు అలవాట్ల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.