Chanakya Niti: పెళ్ళికి జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి, మీరు ఎప్పటికీ చింతించరు

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) రచించిన నీతి శాస్త్రం నేటికీ అనుసరణీయం. తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఇందులో మనిషి తన జీవితాన్ని..

Chanakya Niti: పెళ్ళికి జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి, మీరు ఎప్పటికీ చింతించరు
Chanakya Niti

Updated on: Apr 25, 2022 | 8:40 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) రచించిన నీతి శాస్త్రం నేటికీ అనుసరణీయం. తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఇందులో మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతం జీవించడానికి అనేక ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి. చాణుక్యుడు చెప్పిన విషయాలను అనుసరించినట్లయితే, ఎవరికైనా విజయం తధ్యమని పెద్దల నమ్మకం. ఆచార్య తన చాణక్య నీతి పుస్తకంలో ఒక వ్యక్తి వివాహ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాడు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలను  చెప్పాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా, వ్యక్తి  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

  1. ఆచార్య చాణక్యుడు ప్రకారం, రోగిని వివాహం చేసుకోండి. అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కారు. సహనం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. జీవితంలో సహనం చాలా ముఖ్యం.
  2. ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి చాలా కోపంగా లేని వ్యక్తిని వివాహం చేసుకోవాలి. ప్రశాంత స్వభావులు ఉండే ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుందని నమ్ముతారు.  కనుక ప్రశాంత స్వభావం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోండి.
  3. మధురంగా మాట్లాడే వ్యక్తి.. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. తియ్యగా మధురంగా మాట్లాడే వ్యక్తిని వివాహం చేసుకోండి. ఇలాంటి వారితో ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.మూర్ఖంగా, అసభ్యకరమైన మాటలు మాట్లాడే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇల్లు రణరంగాన్ని తలపిస్తుంది.
  4. మతపరమైన ఆచారాలు పాటించే వ్యక్తి:  ఆచార్య చాణక్యుడు ప్రకారం, మతపరమైన పూజాదికార్యక్రమాలు చేసే వ్యక్తిని వివాహం చేసుకోండి. దేవుడిని నమ్మే వ్యక్తి.  క్రమం తప్పకుండా పూజలు చేసే వ్యక్తి.. జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొంటారు. దైవాన్ని నమ్ముకున్న వ్యక్తి జీవితానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవటానికి శక్తిని పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read:

గుడికి వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం !! బూట్లు కొట్టేసిన దొంగ !! ఆ తరవాత ఏంజరిగిందంటే ??

Sara Tendulkar: డాక్టర్ చదివి యాక్టర్ గా మారుతున్న ప్రముఖ క్రీడాకారుడు తనయ.. త్వరలో వెండి తెరపై ఎంట్రీ అంటూ టాక్..

ISKCON Temple: రోజు రోజుకీ పెరుగుతున్న వేసవి తాపం.. చల్లదనం కోసం దేవుళ్ళకు ఏసీ, ఫ్యాన్ల సౌకర్యం.. ఎక్కడంటే..