Chanakya Niti: ఆచార్య చాణక్యుడి (Acharya Chanakya) మాటలు మనందరికీ స్ఫూర్తి. చాణక్యుడు నీతి శాస్త్రం (Niti shastra) లో చెప్పిన విషయాల నుంచి అనేక విషయాలను నేర్చుకోవచ్చు. తద్వారా రాబోయే కాలంలో మనం మోసపోకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. మంచి, చెడుల మధ్య తేడాను తెలుసుకోవచ్చు. చాణక్య నీతిలో జీవితంలో ఏదైనా సాధించాలంటే కొన్ని విషయాలను పాటించమని తెలిపాడు. అవి ఏమిటంటే..
చాణక్య నీతి ప్రకారం.. అగ్ని నైజం కాల్చేది.. దానిని తలమీద పెట్టుకుని మోసినా దాని నైజం మారినట్లు .. అదే విధంగా, దుర్మార్గుడిని మీరు ఎంత గౌరవించినా.. అతని గుణం ఎప్పుడూ మారదు.
ఆచార్య చాణక్య ప్రకారం.. జీవితంలో విజయం సాధించడానికి ప్రాథమిక మంత్రం క్రమశిక్షణ. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి సమయం విలువను గుర్తిస్తాడు, అలాగే ఒక పనిని సమయానికి పూర్తి చేయగల సామర్థ్యాన్నిపెంపొందించుకుంటాడు.
నిన్ను గౌరవించని చోట, జీవనోపాధి పొందలేని చోట, స్నేహితులు లేని చోట, జ్ఞానం గురించి మాట్లాడని చోట ఒక్క క్షణం కూడా ఉండవద్దని చాణక్యుడు చెప్పాడు.
అదృష్టం మీద ఆధారపడి పనిచేసే వ్యక్తులు సోమరితనం, అజాగ్రత్త పరులుగా మారతారు.
భూమి సత్యంపై ఆధారపడి ఉంది. సూర్యుడు ప్రకాశించడం, గాలి వీచడం కూడా వాస్తవం. సత్యం అందరికీ ఒకేలా ఉంటుంది. ఎప్పటికీ మారదు. ఈ సత్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న వ్యక్తి, అతని జీవితం ముగిసింది.
Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
IPL 2022: జడేజా నిరీక్షణ ముగిసింది.. ‘డబుల్ సెంచరీ’ తర్వాత కెప్టెన్ అయ్యాడు..