Chanakya Niti: ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట! వెంటనే మార్చుకోండి!

ఆడపిల్లను ఇంటి మహాలక్ష్మి అంటారు. ఒక ఇంటి శ్రేయస్సు, సంపద, కుటుంబంలో శాంతి, ప్రశాంతత ఇవన్ని ఇంట్లోని ఆడవాళ్లపైనే ఆధారపడి ఉంటాయి. కానీ వాళ్లకు ఉండే కొన్ని అలవాట్లు ఇంట్లో అశాంతికి కారణం అవుతాయిని, దాని వల్ల ఇంటికి సంపద, శ్రేయస్సు దూరం అవుతాయని ఆచార్య చాణిక్యుడు అంటున్నారు. కాబట్టి మహిళల ఏ అలవాట్లు ఇంటి శాంతిని నాశనం చేస్తాయో తెలుసుకోవడం చాలా మఖ్యం.

Chanakya Niti: ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట! వెంటనే మార్చుకోండి!

Updated on: Dec 16, 2025 | 9:02 AM

ఒక ఇంటి గౌరవం, మర్యాద, ఇంట్లోని శాంతి మొత్తం ఆ ఇంటి ఇళ్లాలుపైనే ఆధారపడి ఉంటాయి. ఇంట్లో వంట నుంచి పిల్లలు, కుటుంబాన్ని చూసుకోవడంలో ఆమె ప్రాత ఎంతో గొప్పది. ఒక మహిళ మంచి ప్రవర్తన ఆ ఇంటి శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతుంది. కానీ ఆమె ప్రవర్తలో కొన్ని అనుకొని మార్పులు ఇంటిని నాశనం చేస్తాయి. అవును, మగాళ్లు చేసే అప్పులు, అనైతిక సంబంధాలు, వృధా ఖర్చు ఎలాగైతే కుటుంబ అశాంతికి కారణం అవుతాయో.. స్త్రీలలో ఉండే ఈ అలవాట్లలో కూడా ఇంటి శాంతి, ప్రశాంతతను నాశనం చేస్తాయి.

స్త్రీలలో ఈ అలవాట్లే ఇంట్లోకి అశాంతికి కారణం

అనవసర ఖర్చు: చాలా మంది మహిళలు డబ్బులు ఖర్చు చేయాలంటే చాలా ఆలోచిస్తారు. కానీ కొందరు మాత్రం డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. తీరా అవి ఆయిపోయాక తల పట్టుకుంటారు. ఇలా అనవసర ఖర్చులు ధనవంతుడిని కూడా పేదవాడిలా మారుస్తాయి. అదేవిదంగా ఒక స్త్రీకి అనవసరంగా ఖర్చు చేసే అలవాటు ఉంటే, ఆమె ఇంట్లో ఎప్పటికీ డబ్బు ఉండదు. దీని కారణంగా, కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

విమర్శిలు తప్పులు వెతకడం: తరచూ ఇతరులను విమర్శించడం, పక్కవారిలో తప్పులు వెతికే అలవాటు ఉన్న స్త్రీ కుటుంబ అశాంతికి కారణం అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు. ఇలాంటి అలవాట్ల కారణంగా కుటుంబంలో తరచుగా విభేదాలు, వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల సంబంధాలు క్షీణిస్తాయి. అలాగే భర్త తక్కువగా సంపాధిస్తున్నాడని భార్య ఎప్పుడైతే విమర్శించడం స్టార్ట్ చేస్తుందో.. ఆ ఇంట్లో వివాధాలు మొదలైనట్టే అని చాణిక్య చెబుతున్నారు.

అహంకారం: స్త్రీ లేదా పురుషుడు అహంకారం అనేది ఎప్పుడూ మంచిది కాదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ముఖ్యంగా ఒక మహిళ తన డబ్బు, అందం లేదా కుటుంబం విషయంలో ఎప్పుడూ గర్వపడకూడదని ఆయన చెబుతున్నారు. ఈ అహంకార భావన మొత్తం కుటుంబంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. అలాగే, ఈ అహంకారం భార్యాభర్తల మధ్య సంబంధాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ చెడు అలవాటు వైవాహిక జీవితానికి పెను ప్రమాదం అంటున్నారు చాణిక్యుడు.

గొడవపడే అలవాటు: తరచూ గొడవపడే స్త్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండదు. అలాగే ఇతరులను సంతోషంగా ఉండనివ్వదని ఆచార్య చాణిక్యుడు చెబుతున్నారు. అలాంటి స్త్రీ కారణంగా, ఇంట్లో ఎల్లప్పుడూ అశాంతి తాండవం చేస్తుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రవేశించదు. ఆ ఇల్లు సంపన్నంగా ఉండదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.

మరిన్ని అథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి