Astro News: దేవుడి ఎదుట పిండి దీపం వెలిగించండి.. ఇంట్లోని ఈ సమస్యలని తరిమికొట్టండి..!

Astro News: హిందూమతం ప్రకారం దేవతల ముందు దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే దీపం ఇంట్లోని నెగిటివ్‌ శక్తిని

Astro News: దేవుడి ఎదుట పిండి దీపం వెలిగించండి.. ఇంట్లోని ఈ సమస్యలని తరిమికొట్టండి..!
Astro News

Updated on: Apr 05, 2022 | 8:15 PM

Astro News: హిందూమతం ప్రకారం దేవతల ముందు దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే దీపం ఇంట్లోని నెగిటివ్‌ శక్తిని పోగొట్టి పాజిటివ్‌ శక్తిని పెంచుతుందని నమ్మకం. ఈ కారణంగా సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా ఆనందం, శ్రేయస్సు వెళ్లివిరుస్తాయని పెద్దలు నమ్ముతారు. అగ్నిదేవుని సాక్షిగా ఏ పని చేసినా సక్సెస్‌ అవుతుందని చెబుతారు. శరీరం సృష్టికి కారణమైన ఐదు మూలకాలలో అగ్ని కూడా ఒకటి. దీపాన్ని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. ప్రజలు ఇళ్లలో రాగి, ఇత్తడి, మట్టితో చేసిన ప్రమిదల ద్వారా దీపాలను వెలిగించి దేవుడిని ఆరాధిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిండితో చేసిన దీపం వెలిగిస్తే చాలా ప్రయోజనాలుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సంపదల దేవత అయిన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఇందుకోసం లక్ష్మీదేవి ముందు ప్రతిరోజూ పిండి దీపం వెలిగించాలి.

2. జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలి. శనివారం రోజు ఆవనూనెతో దీపం వెలిగిస్తే శనిగ్రహదోషాలు తొలగిపోతాయి.

3. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే పిండితో చేసిన దీపాన్ని క్రమం తప్పకుండా వెలిగించాలి. అన్ని సమస్యలు తొలగిపోతాయి.

4. పిండి దీపం వెలిగించడం ద్వారా మీ కోరిక నెరవేరితే ఈ పరిహారం చేయడం ఆపవద్దు. మధ్యలో వదిలేస్తే మంచిది కాదు.

5. హనుమంతుడి ఎదుట 11 వారాలు పిండి దీపం వెలిగిస్తే మీరు కోరుకున్నది జరగుతుందని నమ్మకం.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని గమనించి ఈ ఆర్టికల్ రాయడం జరిగిందని గుర్తించండి.

IPL 2022: ‘చెన్నై కెప్టెన్‌ ఇప్పటికీ ధోనినే.. తలనొప్పిగా మారిన జడేజా’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వెటరన్ ప్లేయర్..!

Health Tips: ఈ 3 ఆహారాలతో షుగర్, బీపీలకి చెక్‌.. కచ్చితంగా డైట్‌లో చేర్చండి..!

Health Tips: రోజు 2 గుడ్ల కంటే ఎక్కువ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!