Appalayagunta : తిరుపతి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం 8.30 నుండి 10.15 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు.
కాగా,బ్రహోత్సవాల్లో భాగంగా 8వ రోజు శనివారం సాయంత్రం స్వామివారు భక్తులకు కల్కి అలంకారంలో దర్శనమిచ్చారు. అశ్వ వాహనంపై ఊరేగారు. ఈ ఉత్సవాలను , వాహనసేవలను ఆలయ సిబ్బంది కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం పై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, తన నామ సంకీర్తనలతో తరించాలని ప్రబోధిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Also Read: Vishnu Sahasranama: ఆర్ధిక ఇబ్బందులను తొలగించే.. విష్ణు సహస్రనామం విశిష్టత