కలిసొచ్చిన మెయిన్‌పురి నుంచే ములాయం ​​​​​​​పోటీ

లఖ్‌నవూ:ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొలిటికల్ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 15 మందితో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను నేడు ప్రకటించింది. పార్టీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఈ సారి మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బంధువులైన ధర్మేంద్ర యాదవ్‌, […]

కలిసొచ్చిన మెయిన్‌పురి నుంచే ములాయం ​​​​​​​పోటీ
Follow us

|

Updated on: Mar 08, 2019 | 2:32 PM

లఖ్‌నవూ:ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొలిటికల్ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 15 మందితో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను నేడు ప్రకటించింది. పార్టీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఈ సారి మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగుతున్నారు.

ఇక ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బంధువులైన ధర్మేంద్ర యాదవ్‌, అక్షయ్‌ యాదవ్‌లకు ఈ సారి కూడా టికెట్లు ఖరారయ్యాయి. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీలుగా ఉన్న బదౌన్‌(ధర్మేంద్రయాదవ్‌), ఫిరోజాబాద్‌(అక్షయ్‌ యాదవ్‌) తమ యధాస్థానాలనుంచే వీరు మరోసారి పోటీ చేస్తున్నారు. ఇత్వా నుంచి కమలేశ్‌ కథారియా, రాబర్ట్స్‌గంజ్‌ నుంచి భాయిలాల్‌ కోల్‌, బహ్‌రాయిచ్‌ నుంచి షబ్బీర్‌ వాల్మికి పేర్లు ఖరారయ్యాయి.

మెయిన్‌పురిలో ములాయంకు పట్టు ఎక్కువే. గతంలో 1996, 2004, 2009లో ములాయం ఇక్కడ పోటీచేసి విజయం సాధించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆజమ్‌గఢ్‌, మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగి రెండు స్థానాల్లో విజయం సాధించారు. మెయిన్‌పురిలో ఏకంగా 3.64లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఫలితాల అనంతరం మెయిన్‌పురి స్థానాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ నేత, ములాయం బంధువైన తేజ్‌ప్రతాప్‌ సింగ్‌ మెయిన్‌పురి నుంచి గెలుపొందారు.

కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు