సుడిగుండంగా మారిన అమెరికా, చైనా మధ్య సముద్ర వివాదం

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, డ్రాగన్‌ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ హక్కును దక్షిణ చైనా సముద్రంలో ఇటీవల అమెరికా వాడుకోవడం అసలు గొడవకు కారణమైంది. తాజాగా ఇది ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.

సుడిగుండంగా మారిన అమెరికా, చైనా మధ్య సముద్ర వివాదం
Follow us

|

Updated on: Jul 14, 2020 | 4:21 PM

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, డ్రాగన్‌ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ హక్కును దక్షిణ చైనా సముద్రంలో ఇటీవల అమెరికా వాడుకోవడం అసలు గొడవకు కారణమైంది. తాజాగా ఇది ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మేము దయ తలిస్తేనే అమెరికా ఇక్కడికి రాగలిగింది.. మా దగ్గర యుద్ధనౌక విధ్వంసక క్షిపణులు ఉన్నాయంటూ గ్లోబల్‌ టైమ్స్‌ చైనా మాటల తూటాలు పేల్చింది. మరోపక్క అమెరికా కూడా చైనాకు అంతే స్థాయిలో సమాధానమిచ్చింది. ఈ ప్రదేశంలో చైనా ఇతర దేశాలను వేధించడం తప్పని పేర్కొంది. దీంతో రెండు అగ్రదేశాల మధ్య వివాదం సుడిగుండంలా చుట్టుకుని మరింత జఠిలమైంది.

దక్షిణ చైనా సముద్రం అనుకుని ఫిలిప్పీన్స్‌, వియత్నాం, తైవాన్‌, బ్రునై, మలేషియా వంటి దేశాలున్నాయి. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల వరకు మాత్రమే ఆయా దేశాల తీర ప్రాంతాల కిందకు వస్తాయి. తీరం నుంచి 200 నాటికల్‌ మైళ్ల దూరం వరకు ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ కిందకు వెళతాయి. అంటే సముద్రం మధ్యలో ఒక దీవి ఉంటే ఆ దీవి చుట్టూ 200 నాటికల్‌ మైళ్ల దూరం ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ ఆ దేశానికి దక్కుతుంది.

అయితే, కొన్ని దశాబ్దాల క్రితం డ్రాగన్‌ కంట్రీ దక్షిణ చైనా సముద్రంలో సర్వే నిర్వహించింది. సముద్ర గర్భంలో భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. దీంతో వీటిని ఎలాగైనా దక్కించుకునేందుకు రకరకాల కుయుక్తులకు డ్రాగన్ పన్నాగం పన్నుతోంది. ఇందులో భాగంగా సముద్రంలోని చాలా దీవులు తనవేనని వాదిస్తోంది. చమురు నిక్షేపాలకు పేరొందిన వాటిల్లో స్పార్ట్‌లీ దీవులు కీలకమైనవి. వీటిని దక్కించుకోవడానికి చైనా ఏకంగా ఒక దీవిని కృత్రిమంగా సృష్టించింది. అక్కడ తన యుద్ధవిమానాలను మోహరించింది. దీంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ దీవుల్లో క్రీస్తు పూర్వం 200 సమయంలో చైనా ప్రజలు ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చేవారని అందుకే ఇది తమదని వాదిస్తోంది. అప్పట్లో హాన్‌ వంశం దీనిని కొనుగొందని చెబుతోంది. వాస్తవానికి 1877లో బ్రిటన్‌ ఈ దీవిని కొనుగోలు చేసినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి.

గల్వాన్‌ లోయలో భారత్‌తో కయ్యానికి దిగిన సమయంలో అమెరికా ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ కోసం తన యుద్ధనౌకలను దక్షిణ చైనా సముద్రం వైపు మళ్లించింది. రెండు విమాన వాహక నౌకలు, నాలుగు యుద్ధనౌకలను ఇక్కడకు తరలించింది. ఫ్రాన్స్ ఉన్న వాటిని అత్యవసరంగా దక్షిణ సముద్రం వైపు తరలించడంతో చైనాపై ఒత్తిడి పెరిగింది. వాస్తవానికి అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ పేరిట అమెరికా యుద్ధవిన్యాసాలు నిర్వహించడం తరుచుగా జరుగుతూనే ఉంటుంది. సమీప దేశాలు ఆయా జలాల్లో వేధింపులకు పాల్పడకుండా వీటిని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే అమెరికా దక్షిణ సముంద్రంలో విన్యాసాలు నిర్వహించింది. దీనిపై చైనా మౌత్‌పీస్‌ గ్లోబల్‌ టైమ్స్‌ స్పందిస్తూ తాము అనుకుంటేనే అమెరికా అక్కడికి రాగలదని పేర్కొంది. తమ వద్ద డీఎఫ్‌ 21, 26 యుద్ధనౌక విధ్వంసక క్షిపణులు ఉన్నాయని పేర్కొంది. 2019లో ఇక్కడ చైనా-అమెరికా నౌకలు ఒక సందర్భంలో దాదాపు ఢీకొన్నంత పనిచేశాయి.

మరోవైపు తాజాగా భారత్‌ కూడా మలబార్‌ యుద్ధవిన్యాసాలకు సన్నాహాలు చేసుకుంటుండటంతో చైనాపై మరింత ఒత్తిడి పెరిగిపోయింది. గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌ పరోక్షంగా కూడా తనకు వ్యతిరేకంగా పనిచేయకూడదని చైనా భావించింది. కానీ, ఇది బెడిసికొట్టింది. అటు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో తాజా ప్రకటన కూడా మరింత కలవరానికి గురిచేసింది. దక్షిణ చైనా సముద్రంలో పట్టుకోసం ఇతరులను డ్రాగన్‌ వేధించడం తప్పు. ఇది పూర్తిగా అన్యాయం. అంతర్జాతీయ చట్టాలను చైనా ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తోంది. ఈ జలాల్లో వేధింపులు, పెట్రోలియం అన్వేషణ పూర్తిగా అంతర్జాతీయంగా చట్టవ్యతిరేకం. దీనిని ప్రపంచం చూస్తూ ఊరుకోదని పాంపియో హెచ్చరించారు. మరోపక్క చైనా కూడా అందుకు ధీటుగా సమాధానం ఇస్తూ వచ్చింది. అమెరికా చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని వాదిస్తోంది. అటు చైనా వ్యతిరేక దేశాలన్ని ఏకంగా పనిలో పడింది అమెరికా.

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!