కరోనా ఎఫెక్ట్: అర్థరాత్రి పార్టీకి 300 మంది.. ఆరుగురు అరెస్ట్..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిబంధనలను ధిక్కరించి 300 మంది అర్థరాత్రి ఓ పార్టీకి హాజరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఓ ప్రైవేట్ రిసోర్ట్ మేనేజర్‌తో పాటు

కరోనా ఎఫెక్ట్: అర్థరాత్రి పార్టీకి 300 మంది.. ఆరుగురు అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 10:34 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిబంధనలను ధిక్కరించి 300 మంది అర్థరాత్రి ఓ పార్టీకి హాజరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఓ ప్రైవేట్ రిసోర్ట్ మేనేజర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేరళలోని హిల్లీ జిల్లాలోని ఉదుంబంచోలలో జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటికి తెలిసిందని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకెళితే.. జూన్ 29 అర్థరాత్రి ఈ పార్టీ జరిగింది. కేరళ అంటువ్యాధి చట్టంతో పాటు భారత శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం జూలై 3న కేసు నమోదైంది. “మేము రిసార్ట్ మేనేజర్‌తో సహా ఆరుగురిని అరెస్టు చేశాము. ఈ కేసుకు సబంధించి దర్యాప్తు కొనసాగుతోంది” అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

Also Read: బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 45 వేలకు పైగా..