శ్రుతీతో బ్రేకప్.. ఆమె తన ఫ్రెండ్ మాత్రమేనంటున్న మైఖేల్

లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్ పలు సినిమాల్లో తన నటనతో మెప్పించింది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ మ్యూజిక్ ప్రోగ్రామ్‌లు చేసుకుంటోన్న ఈ బ్యూటీ.. ఇటీవలే విజయ్ సేతుపతితో రీ ఎంట్రీకి ఓకే చెప్పింది. అంతేకాదు తెలుగులోనూ ఆమె సినిమా స్క్రిప్ట్‌లను వింటున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా శ్రుతీ, ఆమె ప్రియుడు మైఖేల్‌ల బంధానికి బ్రేకప్ పడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా తనతో […]

శ్రుతీతో బ్రేకప్.. ఆమె తన ఫ్రెండ్ మాత్రమేనంటున్న మైఖేల్
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 12:42 PM

లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్ పలు సినిమాల్లో తన నటనతో మెప్పించింది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ మ్యూజిక్ ప్రోగ్రామ్‌లు చేసుకుంటోన్న ఈ బ్యూటీ.. ఇటీవలే విజయ్ సేతుపతితో రీ ఎంట్రీకి ఓకే చెప్పింది. అంతేకాదు తెలుగులోనూ ఆమె సినిమా స్క్రిప్ట్‌లను వింటున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా శ్రుతీ, ఆమె ప్రియుడు మైఖేల్‌ల బంధానికి బ్రేకప్ పడినట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా తనతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన శ్రుతీకి  లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సేల్‌ గుడ్‌బై చెప్పినట్లు తాజా వార్త. ఆమె తనకు బెస్ట్ ఫ్రెండ్‌గానే ఉంటుందంటూ మైఖేల్ కోర్సేల్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ‘‘ఈ యంగ్ లేడీ ఇకపై నాకు జీవితాంతం స్నేహితురాలిగా ఉండిపోతుంది. ఆమెకు ఎప్పుడూ ఫ్రెండ్‌గా ఉండటం నా అదృష్టం. లవ్ యు గర్ల్ ’’అంటూ ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా శ్రుతీ హాసన్‌తో తీసుకున్న ఓ ఫొటోను కూడా మైఖేల్ షేర్ చేశాడు.

కాగా 2016లో శ్రుతీ ఓ ప్రోగ్రామ్ నిమిత్తం లండన్ వెళ్లినప్పుడు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మైఖేల్‌ను కలిసింది. ఆ తరువాత ఇద్దరి మధ్య మొదలైన స్నేహం చివరకు ప్రేమగా మారింది. ఈ క్రమంలో శ్రుతీ ఇంట్లో జరిగే పలు శుభకార్యాలకు మైఖేల్ కూడా హాజరయ్యాడు. అంతేకాదు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’లోనూ మైఖేల్ రష్యన్ సోల్జర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

https://www.instagram.com/p/Bws8P5gnqPh/