సానియా మీర్జాకి మద్దతు పలికిన సెహ్వాగ్, అక్తర్

Shoaib Akhta, సానియా మీర్జాకి మద్దతు పలికిన సెహ్వాగ్, అక్తర్

భారత్‌తో గత ఆదివారం జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవడంతో అనూహ్యంగా విమర్శలు ఎదుర్కొన్న  షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాకి మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, షోయబ్ అక్తర్ మద్దతుగా నిలిచారు. భారత్‌పై మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే షోయబ్ మాలిక్ గోల్డెన్ డక్ కాగా… దానికి జంక్ ఫుడ్ కారణమంటూ పాక్ అభిమానులు మండిపడ్డారు.

‘పాకిస్థాన్ ఓటమికి సానియా మీర్జానే కారణమంటూ చాలా మంది నిందిస్తున్నారు. కానీ.. ఇందులో ఆమె చేసిన తప్పు ఏంటి..? కొంత మంది ఆమె ఇంగ్లాండ్‌కి ఎందుకు వెళ్లింది..? అని ప్రశ్నిస్తున్నారు. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆమె భర్త. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేశారు. ఇందులో తప్పు ఎక్కడుంది..?’ అని అక్తర్ ప్రశ్నించాడు.

‘క్రికెటర్ల వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని కలపకూడదు. గతంలో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ విషయంలోనూ ఇదే జరిగింది. మ్యాచ్‌ చూసేందుకు అనుష్క శర్మ వస్తే.. ఆమె కారణంగా కోహ్లీ ఔటయ్యాడని విమర్శించారు. జట్టు, ఆటగాళ్లపై మీకు ప్రేమ ఉండొచ్చు. కానీ.. వారి పర్సనల్‌ లైఫ్‌లోకి వెళ్లకూడదు’ అని సెహ్వాగ్ సూచించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *