Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

శివసేన మాస్టర్ ప్లాన్‌తో.. ఈ యువనేత ‘వార్’ వన్ సైడ్ అయినట్లే!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు శివసేన పార్టీకి కీలకంగా మారాయి. ఎప్పటిలానే ఈసారి కూడా బీజేపీ-శివసేన కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి సీఎం పదవిని చేపట్టాలని శివసేన పక్కా ప్రణాళికలు రచిస్తోంది. 1966లో బాల్ థాక్రే శివసేన పార్టీని స్థాపించారు. అయితే అప్పటి నుంచి నేటివరకు ఈ థాక్రే కుటుంబం నుంచి ఎవ్వరూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత ఈ కుటుంబం నుంచి ఈసారి ఓ యువనేత ఎన్నికల బరిలోకి దిగారు. అతనే ఉద్దవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే.. ఇక అతడు సీఎం పీఠం ఎక్కాలంటే.. తెలుగువారి ఓట్లే కీలకం కానున్నాయి.

శివసేనకు కంచుకోట లాంటి వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా యువసేన చీఫ్ ఆదిత్య థాక్రే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. థాక్రే కుటుంబం నుంచి ఆదిత్య థాక్రే మొదటిసారి ఎన్నికల బరిలో దిగడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆదిత్య థాక్రే గెలుపే లక్ష్యంగా వ్యహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తెలుగు సహా ఇతర భాషల్లో ప్రచారం చేస్తున్నారు. వర్లీ ఏరియాలో ఉన్న తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు ‘నమస్తే వర్లీ’ అనే ఫ్లెక్సీలతో పలకరించారు. అటు గుజరాతీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో గుజరాతీ భాషలో.. ముస్లిం మెజార్టీ ఏరియాల్లో  ఉర్దూలో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అంతేకాక థాక్రే కుమారుడి రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో తెలుగువారి పాత్రే కీలకం కానుంది.

ఇకపోతే ప్రస్తుతం వర్లీ నియోజకవర్గం నుంచి శివసేన ఎమ్మెల్యే సునీల్ షిండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఇది ఆదిత్యకు కలిసొచ్చే అంశం. ఇక ఇక్కడ కాంగ్రెస్–ఎన్సీపీ మిత్రపక్షం లేదా వంచిత్ ఆఘాడి ఎమ్మెన్నెస్ అభ్యర్ధులు పోటీ చేసినా ఆదిత్య థాక్రే గెలుపు వన్ సైడ్ అయిపోనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆదిత్యపై పోటీ చేస్తే డిపాజిట్లుగా కూడా రావనే పరిస్థితి ఏర్పడింది. అందుకే మిగిలిన అభ్యర్థులు పోటీ చేయడం కంటే ఆదిత్యను ఏకగ్రీవంగా గెలిపించాలని శివసేన నాయకులు, మిగతా పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారని ఇన్‌సైడ్ టాక్. మరోవైపు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) ఆదిత్య థాక్రేతో పోరు ఎందుకని వెనక్కి తగ్గాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ యువనేతకు వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.