మేం ప్రతిపక్షంలో కూర్చుంటాం.. మారిన పవార్ గళం

నిన్న మొన్నటివరకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతోనూ, శివసేనతోను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పిన ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ గళం మారింది. అసెంబ్లీలో తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆయన ప్రకటించారు. బీజేపీ లేకుండా శివసేన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిధ్ధంగా ఉన్న పక్షంలో మా పార్టీ తప్పకుండా పాజిటివ్ దృక్పథం వహిస్తుందని ఆయన అన్నారు. అటు-ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. ఏ నిర్ణయమైనా తీసుకుంటే ప్రత్యామ్నాయం ఉండనే ఉంటుందని ఎన్సీపీ […]

మేం ప్రతిపక్షంలో కూర్చుంటాం.. మారిన పవార్ గళం
Follow us

|

Updated on: Nov 07, 2019 | 6:11 PM

నిన్న మొన్నటివరకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతోనూ, శివసేనతోను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పిన ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ గళం మారింది. అసెంబ్లీలో తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని ఆయన ప్రకటించారు. బీజేపీ లేకుండా శివసేన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిధ్ధంగా ఉన్న పక్షంలో మా పార్టీ తప్పకుండా పాజిటివ్ దృక్పథం వహిస్తుందని ఆయన అన్నారు. అటు-ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. ఏ నిర్ణయమైనా తీసుకుంటే ప్రత్యామ్నాయం ఉండనే ఉంటుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. అయితే దీనిపై శివసేన పార్టీయే ముందుగా స్పందించాల్సి ఉంది. ఈ నెల 7 కల్లా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన రావచ్చునని బీజేపీ నేత సుధీర్ ముంగంటి వార్ చేసిన వ్యాఖ్యపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయజూస్తే దాన్ని అడ్డకుంటామన్నారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేం సిధ్ధంగా ఉన్నాం.. అయితే సేన మొదట తన వైఖరేమిటో చెప్పాలి అని నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ఎలాగైనా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుండా చూసేందుకు తాము సేనకు మద్దతునిచ్చెందుకు రెడీగా ఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్, సేన పార్టీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ నేత శరద్ పవార్ సుముఖంగా ఉన్నారని., ఇదే విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించేందుకు ఆయన సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. అయితే రాత్రికి రాత్రే సీన్ మారిపోయినట్టు జేకనిపిస్తోంది. ఆయన ప్రతిపాదనకు సేన అధిష్ఠానం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యోచనపట్ల అంత చొరవ చూపని కారణంగానే పవార్ తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో