ఢిల్లీ అల్లర్లపై.. అమిత్ షా మీటింగ్.. హాజరైన పోలీస్ ఉన్నతాధికారులు

దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ.. పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. మంగళవారం రాత్రి 7.00 గంటల నుంచి 10.00 గంటల వరకు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. షాతో పాటుగా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ఢిల్లీ పోలీసు చీఫ్‌ అమూల్య పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అయితే అల్లర్లను అదుపు చేసేందుకు తమకు తగినంత పోలీస్ బలగాలు […]

ఢిల్లీ అల్లర్లపై.. అమిత్ షా మీటింగ్.. హాజరైన పోలీస్ ఉన్నతాధికారులు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 26, 2020 | 11:58 AM

దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ.. పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. మంగళవారం రాత్రి 7.00 గంటల నుంచి 10.00 గంటల వరకు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. షాతో పాటుగా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ఢిల్లీ పోలీసు చీఫ్‌ అమూల్య పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

అయితే అల్లర్లను అదుపు చేసేందుకు తమకు తగినంత పోలీస్ బలగాలు లేవని.. ఈ కారణం చేతే.. హింసాత్మక ఘటనలు పెరిగాయని అమిత్‌ షాకు ఢిల్లీ సీపీ అమూల్య పట్నాయక్‌ తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో శాంతిని పునరుద్ధరించడానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు చేతులు కలపాలని సమావేశంలో తీర్మానించారు. కాగా, పార్టీలకతీతంగా సమస్యకు పరిష్కారం కనుగొనాలని.. హింసాత్మక సంఘటనలు జరగకుండా.. అంతా సంయమనం పాటించాలని అమిత్‌ షా పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రసంగాలు మానుకోవాలని కోరారు.