త్వరలో రోడ్డెక్కనున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, బొమ్మ కార్లతో ట్రయల్స్ చేసిన పరిశోధకులు

టెక్నాలజీ అమిత వేగంగా పుంజుకుంటున్న తరుణంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనేవి ఇప్పుడు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. దిగ్గజ కంపెనీలు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేసే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే ముందుగా ట్రయల్స్ చేసేందుకు వారు పలు పరిశోధనలు చేపడుతున్నారు. ఒక్కసారి రోడ్డుపైకి వచ్చాక వాటి పనితీరులో లోపం రాకుండా ప్రమాదాలు జరగకుండా ఏలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై పలు ప్రయోగాలు చేపడుతున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఓ మినికార్ ను తయారు చేసి సెల్ఫ్ […]

త్వరలో రోడ్డెక్కనున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, బొమ్మ కార్లతో ట్రయల్స్ చేసిన పరిశోధకులు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 6:31 PM

టెక్నాలజీ అమిత వేగంగా పుంజుకుంటున్న తరుణంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనేవి ఇప్పుడు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. దిగ్గజ కంపెనీలు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేసే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే ముందుగా ట్రయల్స్ చేసేందుకు వారు పలు పరిశోధనలు చేపడుతున్నారు. ఒక్కసారి రోడ్డుపైకి వచ్చాక వాటి పనితీరులో లోపం రాకుండా ప్రమాదాలు జరగకుండా ఏలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై పలు ప్రయోగాలు చేపడుతున్నారు.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఓ మినికార్ ను తయారు చేసి సెల్ఫ్ డ్రైవింగ్ పై పలు పరిశోధనలు చేపట్టింది. రహదారులపై కాకుండా మొదటగా బొమ్మకార్లను తయారు చేసి పలు మార్లు టెస్ట్ డ్రైవ్ లు నిర్వహించారు. దీని కోసం ఓ ఎనిమిది ఇంచుల సైజులో 16 కార్లను తయారు చేశారు. తక్కువ బడ్జెట్ లోనే వీటిని తయారు చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే టెక్నాలజీతో నిజమైక కార్లను రూపొందించే వీలుగా వీటికి సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. వీటితో టెస్ట్ డ్రైవ్ చేయించడానికి ప్రత్యేకంగా ట్రాక్ లను నిర్మించారు. ఆ ట్రాక్ లపై మినికార్లను పలు లైన్లలో పెట్టి డ్రైవ్ చేయించారు. వాటిలో ఇంటర్నెట్ మరియు రేడియో కనెక్షన్లను కూడా అమర్చారు.

నావిగేషన్ సిస్టమ్ తో ఈ కార్లు ట్రాక్ పై పరుగెత్తనున్నాయి. ఇవి స్వయంగా ముందున్న వాహనాలను గుర్తించి పక్క ట్రాక్ లోకి వాటంతట అవే మారేవిధంగా వీటిలో సాఫ్ట్ వేర్ రూపొందించారు. అయితే ఇదంతా సెల్ఫ్ డ్రైవ్ కారు దానంతట అదే సంకేతాలను తీసుకునేలా రూపొందించారు. ఒక కారు ముందున్న కారుకి సంకేతాలను ఇచ్చేలా సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశారు. కారు బాహ్యవలయంలో రూపొందించిన క్యాప్చరింగ్ వ్యవస్థ ద్వారా ముందున్న కారుకు సంకేతాలను అందజేస్తుంది. దీంతో కార్లమధ్య ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. ఒకేసారి ట్రాక్ లపై ఎక్కువ కార్లు వస్తే ఏ కారు ఏ ట్రాక్ పై ప్రయాణిస్తుందో తెలుసుకుని వెంటనే కంట్రోల్ రూంకి సంకేతాలు అందేలా సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. అయితే ప్రయోగశాలలో అన్ని రకాల ప్రయోగాలు చేపట్టారు. అయినా కూడా మరి కొన్ని రకాల ప్రయోగాలు చేపట్టిన అనంతరం దీనిపై ముందడుగు వేసే అవకాశం ఉందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధనలు చేపడుతున్న శాస్త్రవేత్త అమందా ప్రోరాక్ తెలిపారు. అయితే ప్రయోగశాలలో చేపట్టిన దానికి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాక చాలా మార్పులు ఉంటాయని.. అయితే ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో ఏమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అన్న దానిపై పరిశోధనలకు అవకాశం ఉంటుందని తెలిపారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో