జైలు నుంచి చిన్నమ్మ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్..?

తమిళనాడు చిన్నమ్మ శశికళకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుందా..? మరి కొన్ని నెలల్లో జైలు నుంచి బయటకు రాబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి తమిళనాట వర్గాలు. సత్ర్పవర్తన కారణంగా ఆమెను విడుదల చేయడానికి జైళ్ల శాఖ కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసి ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డిసెంబర్‌లో చిన్నమ్మ విడుదల ఉండవచ్చునని సమాచారం. అయితే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నిచ్చెలిగా పేరొందిన శశికళ.. ఒకప్పుడు అన్నాడీఎంకే చక్రం తిప్పింది. ముఖ్యంగా 1991-96కాలంలో అమ్మ, […]

జైలు నుంచి చిన్నమ్మ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్..?
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2019 | 10:52 AM

తమిళనాడు చిన్నమ్మ శశికళకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుందా..? మరి కొన్ని నెలల్లో జైలు నుంచి బయటకు రాబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి తమిళనాట వర్గాలు. సత్ర్పవర్తన కారణంగా ఆమెను విడుదల చేయడానికి జైళ్ల శాఖ కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసి ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డిసెంబర్‌లో చిన్నమ్మ విడుదల ఉండవచ్చునని సమాచారం.

అయితే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నిచ్చెలిగా పేరొందిన శశికళ.. ఒకప్పుడు అన్నాడీఎంకే చక్రం తిప్పింది. ముఖ్యంగా 1991-96కాలంలో అమ్మ, చిన్నమ్మ భారీ అక్రమార్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ తరువాత ప్రభుత్వంలోకి వచ్చిన డీఎంకే కేసు వేసింది. దీనికి సంబంధించి మొదట తమిళనాడు, తరువాత కర్ణాటక ప్రత్యేక కోర్టులో ఏళ్ల తరబడి విచారణ సాగింది. ఆ తరువాత సుప్రీంకు చేరగా.. ఈ కేసులో అందర్నీ దోషులుగా తేల్చింది. అయితే అప్పటికే జయలలిత మరణించడంతో.. ఆమెను పక్కనపెట్టి శశికళ, ఆమె బంధువులు ఇళవరిసి, సుధాకరన్‌లకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో 2017 నుంచి ఆమె జైలులో ఉన్న విషయం తెలిసిందే.