సంచలనంగా మారిన సానియా మీర్జా లేఖ… ఆడుతుందా..! లేదా..! అభిమానుల్లో కొత్త అనుమానాలు

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసిన లెటర్ వైరల్ గా మారింది. ఈ లేఖలో సానియా తన అనుభవాలను రాసుకొచ్చింది. ఆ లేఖను ప్రపంచంలోని తల్లులందరికీ అంకితం చేసింది.

  • Sanjay Kasula
  • Publish Date - 1:45 pm, Thu, 26 November 20

Sania Mirza : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసిన లెటర్ వైరల్ గా మారింది. ఈ లేఖలో సానియా తన అనుభవాలను రాసుకొచ్చింది. ఆ లేఖను ప్రపంచంలోని తల్లులందరికీ అంకితం చేసింది. గర్భధారణ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు.. కొడుకు పుట్టిన తర్వాత ఆమె పొందిన అనుభూతి.. వంటివి ఆ లేఖలో రాసుకొచ్చింది.

దైనందిన జీవితంలో సందిగ్ద పరిస్థితులను ఎదుర్కొంటున్న తల్లులందరికీ ఈ లేఖను అంకితం ఇస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత.. 2020 లో డబుల్స్ టైటిల్ గెలిచిన తర్వాత సానియా మళ్లీ టెన్నిస్ బ్యాట్ పట్టలేదు. తన కొడుకు ఇజాన్ కు జన్మనిచ్చిన తర్వాత ఆమె నెగ్గిన తొలి ట్రోఫీ ఇది.

ఇటీవలే ఆమె డిస్కవరీ ప్లస్ లో దిగ్గజ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గురించిన ఒక డిస్కవరీని చూసిన తర్వాత తనలో మెదిలిన భావాలను లేఖ రూపంలో రాసి దానిని సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసింది. ఈ లెటర్‌ చూసిన వారు సానియా ఇక టెన్నిస్‌ రాకెట్‌ పడుతుందా అని అనుమానిస్తున్నారు.

ఒకప్పుడు తన ఆటతో యూత్‌ను ఉర్రూతలూగించిన సానియా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక టైటిళ్లు నెగ్గింది. గ్రాండ్‌స్లామ్స్‌లో భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రతిభను కనబర్చింది. పెళ్లైన తర్వాత కూడా ఆటను కొనసాగించింది. అయితే సానియా లెటర్‌ తర్వాత ఆమె ఇక ఆడుతుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.