Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

సమత, హాజీపూర్ కేసుల తుది తీర్పులు వాయిదా.!

Samata And Hajipur Rape Cases, సమత, హాజీపూర్ కేసుల తుది తీర్పులు వాయిదా.!

Samata And Hajipur Rape Cases: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన రెండు కీలకమైన కేసుల్లో రావాల్సిన తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఇందులో ఒకటి ఆసిఫాబాద్ సమత అత్యాచార కేసు కాగా.. మరొకటి హాజీపూర్ వరుస హత్యల కేసు. రెండు కేసుల్లోని నిందితులకు ఉరి శిక్షను విధించాలని ఇప్పటికే గ్రామస్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సమత అత్యాచార కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవు తీసుకోవడంతో తుది తీర్పును ఈ నెల 30వ తేదికి వాయిదా వేస్తున్నట్లు ప్రాసిక్యూషన్ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసుపై తీర్పు ఇవాళ వెలువడే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా తుది తీర్పు వాయిదా పడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌ గ్రామ అటవీ ప్రాంతంలో  సమతపై అదే గ్రామానికి చెందిన షేక్‌ బాబా, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మగ్దూమ్‌లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి.. ఆపై హత్య చేశారు. ఇక ఈ కేసు విచారణ వేగవంతం కావడానికి డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

మరోవైపు హాజీపూర్ వరుస హత్యల కేసు తుది తీర్పును కూడా నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై తుది తీర్పు ఫిబ్రవరి 6న వెలువడనుంది.

Related Tags