రష్యాలో కరోనా విలయ తాండవం.. కేసుల వివరాలు చూస్తే షాక్..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అరకోటికి పైగా చేరింది. ఇక ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, యూరప్ దేశాలతో పాటు.. రష్యాలో కూడా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా రష్యాలో కొత్తగా మరో 8,338 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షల డెబ్బై వేల మార్క్‌ను దాటింది. గడిచిన 24 గంటల్లో […]

రష్యాలో కరోనా విలయ తాండవం.. కేసుల వివరాలు చూస్తే షాక్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 27, 2020 | 7:50 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అరకోటికి పైగా చేరింది. ఇక ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, యూరప్ దేశాలతో పాటు.. రష్యాలో కూడా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా రష్యాలో కొత్తగా మరో 8,338 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షల డెబ్బై వేల మార్క్‌ను దాటింది. గడిచిన 24 గంటల్లో 8,338 కొత్త కేసులు నమోదవ్వగా.. 11 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి 161 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,968కి చేరింది. దేశంలో రోజురోజుకు కేసుల తీవ్రత పెరుగుతుండటంతో.. అధ్యక్షుడు పుతిన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంటాక్ట్ కేసులను గుర్తించి.. టెస్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.