సినీ ఫక్కిలో రాబరీ..అమాయకుడు బలి

Robber steals a car by putting a gun on NRI's head

అమెరికా ఫ్లోరిడాలో సినీ ఫక్కిలో జరిగిన బ్యాంకు రాబరీ చివరకు విషాదంగా మారింది. స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో చొరబడిన దుండగుడు క్యాషీయర్ తలపై గన్ పెట్టి బ్యాంకులో ఉన్న డబ్బంతా తన వెంట తెచ్చుకున్న బ్యాగులో సద్దమని  బెదిరించాడు. దీంతో వణికిపోయిన క్యాషీయర్ డబ్బంతా బ్యాగులో పెట్టగానే దాన్ని తీసుకుని హడావుడిగా బయటకు పరిగెత్తాడు ఆ దొంగ. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే బ్యాంక్ సిబ్బంది ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. క్షణాల్లో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే, అది గమనించిన దొంగ వెంటనే అప్రమత్తమై పక్కనే ఆగి వున్న ఓ కారు యజమానిని  అడ్డుగా పట్టుకున్నాడు. అతని తలకు తుపాకీ గురిపెట్టి అచ్చం సినిమాల్లో మాదిరిగా దుండగుడు డ్రైవర్ సీటులో కూర్చుని మెరుపువేగంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతడు డ్రైవ్ చేస్తున్న కారు అదుపుతప్పి కొంత దూరంలోనే ప్రమాదానికి గురైంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా కారు యజమాని మాత్రం కనిపించలేదు. అతడి కోసం పరిసరాల్లో గాలించగా చివరకు అతడి మృతదేహం లభించింది. మృతుడి కుటంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు డెడ్ బాడిని కూడా అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *