రైల్వే ప్రయాణికులకు గమనిక… ఈ స్టేషన్లలో మాత్రమే ఆగదు

రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో నేటి నుంచి కొన్ని రైల్వేస్టేషన్లలో హాల్టలను రైల్వేశాఖ నిలిపివేసింది. కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం కొన్ని స్టేషన్లలో స్టాప్‌లు నిలిపివేసినట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.

రైల్వే ప్రయాణికులకు గమనిక... ఈ స్టేషన్లలో మాత్రమే ఆగదు
Follow us

|

Updated on: Jun 04, 2020 | 11:01 AM

దాదాపు రెండు నెలల తర్వాత జూన్‌ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రైల్వేస్టేషన్లు కళకళలాడుతున్నాయి. గత నాలుగు రోజులుగా..ఏపీలో 22 ట్రైన్లు నడుస్తున్నాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సూచన చేసింది. రైలు సర్వీసుల కోసం ప్రస్తుతం ఉన్న కొన్ని స్టాప్‌లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో నేటి నుంచి కొన్ని రైల్వేస్టేషన్లలో హాల్టలను రైల్వేశాఖ నిలిపివేసింది. కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం కొన్ని స్టేషన్లలో స్టాప్‌లు నిలిపివేసినట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.

రైళ్లు ఆగని స్టేషన్ల వివరాలు ఇవి :

1. సికింద్రాబాద్- ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02703/02704) : పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట, పలాస, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగదు.

2. సికింద్రాబాద్‌-గుంటూరు(గోల్కొండ ఎక్స్‌ప్రెస్) : కొండపల్లి, రాయనపాడు, కృష్ణాకెనాల్‌, మంగళగిరి, నంబూరు, పెదకాకానిలో ఆగదు.

3. హైదరాబాద్‌-విశాఖ(గోదావరి ఎక్స్‌ప్రెస్)(ట్రైన్ నెంబర్ 02728/02727) : తాడేపల్లిగూడెం, నిడదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం, ఎలమంచిలి, దువ్వాడ స్టేషన్లలో ఆగదు.

4. తిరుపతి-నిజామాబాద్‌(రాయలసీమ ఎక్స్‌ప్రెస్) (ట్రైన్ నెంబర్ 02793/02794) : రేణిగుంట, కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గూటి స్టేషన్లలో ఆగదు.

5. ముంబై-భువనేశ్వర్‌(కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్) (ట్రైన్ నెంబర్ 01019/01020) : తాడేపల్లిగూడెం, నిడదవోలు, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగదు.

6. ముంబై-బెంగళూరు(ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్) ట్రైన్ నెంబర్01031 /01032): ఆదోని, గూటి, ధర్మవరం, ప్రశాంతి నిలయం, పెనుకొండ, హిందూపురంలో ఆగదు.

ఈ క్రింది స్టేషన్లలో రైళ్లు ఆగుతాయి:

7. విశాఖపట్నం-న్యూఢిల్లీ(ఏపీ ఎక్స్‌ప్రెస్‌) (ట్రైన్ నెంబర్02805/02806) : రాజమండ్రి, ఏలూరు, బెజవాడలో ఆగనుంది.

8. యశ్వంత్‌పూర్‌-హౌరా(దురంతో ఎక్స్‌ప్రెస్‌): విజయవాడ, రేణిగుంటలో ఆగనుంది. విజయనగరంలో ఆగదు.

9. బెంగళూరు-నిజాముద్దీన్‌(రాజధాని): గుంతకల్‌, అనంతపురం స్టేషన్లలో ఆగనుంది.

10. నిజాముద్దీన్‌-చెన్నై (బై వీక్లీ) (ట్రైన్ నెంబర్ 02434 /024333): విజయవాడలో ఆగుతుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో