Breaking News
  • 77 లక్షల 61 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో 54,366 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. .గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 690 మంది మృతి . గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 73,979 .దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 77,61,312 .దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 6,95,509 .“కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 69,48,497 .“కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,17,306 . దేశంలో 89.53 శాతం కరోనా రోగుల రికవరీ రేటు . దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.96 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి తగ్గిన మరణాల రేటు . గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 14,42,722 . ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 10,01,13,085.
  • టీవీ9 తో ప్రముఖ డెర్మటాలజిస్ట్ స్వప్న ప్రియ. కలుషిత నీటితో తో చర్మ రోగాలు, ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదాలు ఉన్నాయి. తామర, ఇంటర్ trigo, ప్రూ రైగో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎక్తైమా, ఇన్ సెక్ట్స్ బైట్ రియాక్షన్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం. వీలైనంత వరకు వరద లోని మురుగు నీటికి దూరంగా ఉంటే మంచిది. షుగర్ పేషెంట్లు గాయాలు కాకుండా మరీ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీటిలోకి వెళ్లాల్సి వస్తే తర్వాత శుభ్రంగా కడిగి పొడి బట్టలు వేసుకోవాలి. బురద ఇంటిని శుభ్రం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళకి దురద, పుండ్లు లాంటివి వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
  • డాలర్ బాయ్ అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు . 139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన మహిళ. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేసిన పోలీసులు. ఈ కేసు ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించిన పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు. ఈ రోజు రిమాండ్ కి తరలించే అవకాశం.
  • మహబూబాబాద్ : ఈరోజు ఉదయం11:00 లకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి గారి ప్రెస్ మీట్. దీక్షిత్ హత్య కేసులో మరిన్ని వివరాలు వెల్లడి చేయనున్న SP కోటిరెడ్డి.
  • నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో రెండు రోజు పర్యటిస్తున్న కేంద్ర బృందం. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వం లో, కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం రఘురామ్, కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ కె కుష్వారా లు నగరంలో పర్యటిస్తున్నారు. నాగోల్, బండ్లగూడ చెరువుల నుండి ఓవర్ ఫ్లో అయి నాలాలులోకి వస్తున్న, వరద నీరు, వరద ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు, స్థానిక ప్రజల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఎల్బీ నగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్ నాగోల్ రాజరాజేశ్వరి కాలనీ లో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన లించిన కేంద్రబృందం.
  • రవాణాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరి సునీల్ శర్మ తో భేటి tsrtc అధికారులు . రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ భవనం లో మొదలయిన సమావేశం. సమావేశం లో పాల్గొన్న తెలంగాణ రవాణాశాఖ ఆపేరేషన్స్ ఈ.డి లు . ఈరోజు అంతరాష్ట్ర బస్సు సర్వుసుల ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం.

‘వెబ్‌ సిరీస్’‌లోకి రేణు ఎంట్రీ.. ఆశీస్సులు కావాలన్న నటి

నటి రేణు దేశాయ్‌ మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు రేణు సిద్ధమయ్యారు. వచ్చే నెల నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ మొదలు కానుంది

Renu Desai news, ‘వెబ్‌ సిరీస్’‌లోకి రేణు ఎంట్రీ.. ఆశీస్సులు కావాలన్న నటి

Renu Desai news: నటి రేణు దేశాయ్‌ మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు రేణు సిద్ధమయ్యారు. వచ్చే నెల నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ మొదలు కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన రేణు.. ఆ ప్రాజెక్ట్ వివరాలను కూడా తెలిపారు.

”కెమెరా ముందుకు రాబోతున్నా. ఓ అద్భుతమైన వెబ్‌సిరీస్‌కి సంతకం చేశా. వచ్చే నెల నుంచి ఇది సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తా. వాస్తవాలను తెలుసుకోవాలనుకునే మహిళ పాత్రలో నటిస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ వెబ్‌ సిరీస్‌కి ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు” అని రేణు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉండే ఓ ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ అహాలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా పవన్ కల్యాణ్ బద్రీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు రేణు. అదే సంవత్సరం తమిళంలో జేమ్స్ పాండ్ అనే చిత్రంలో కనిపించారు. ఇక మూడు సంవత్సరాల తరువాత జానీలో ఆమె నటించారు. నటిగా ఎక్కువ సినిమాల్లో నటించనప్పటికీ.. పవన్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. అయితే పవన్‌తో విడాకుల తరువాత పుణెకు వెళ్లిన రేణు మంగలాస్టక్ వన్స్ మోర్ అనే నిర్మాతగా మారి.. 2014లో ఇష్క్ వాలా లవ్ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇక ఆ మధ్యన బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన రేణు.. ఇప్పుడు డిజిటల్‌లోకి‌ ఎంట్రీ ఇస్తున్నారు.

Read More:

షో తరువాత చాలా కోల్పోయాం.. ‘బిగ్‌బాస్’‌పై మాజీ కంటెస్టెంట్‌ల సంచలన వ్యాఖ్యలు

ఐదేళ్ల వయసులోనే కిమ్‌ పడవ నడిపేవాడట

Related Tags