ఆ గ్రామ వాలంటీర్లను తక్షణమే తొలగించండి

ఏపీలో గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన చదువుకుంటున్న విద్యార్థులకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఎం. గిరిజా శంకర్ షాక్ ఇచ్చారు. వారిని తక్షణమే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులను పలుచోట్ల వాలంటీర్లుగా ఎంపిక చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒక శక్తివంతమైన వ్యవస్థను నిర్మిస్తున్న దశలో ఈ ఎంపికలను తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిషనర్ అన్నారు. దీన్ని వెంటనే సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను, […]

ఆ గ్రామ వాలంటీర్లను తక్షణమే తొలగించండి
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 12:20 PM

ఏపీలో గ్రామ వాలంటీర్లుగా ఎన్నికైన చదువుకుంటున్న విద్యార్థులకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఎం. గిరిజా శంకర్ షాక్ ఇచ్చారు. వారిని తక్షణమే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులను పలుచోట్ల వాలంటీర్లుగా ఎంపిక చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒక శక్తివంతమైన వ్యవస్థను నిర్మిస్తున్న దశలో ఈ ఎంపికలను తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిషనర్ అన్నారు. దీన్ని వెంటనే సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను, జిల్లా పంచాయితీ అధికారులను, జడ్పీ సీఈవోలను ఆదేశించారు. వీరితో పాటు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారిని కూడా గుర్తించి తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.