చెర్రీని పోలీస్‌ బెల్ట్‌తో కొట్టిన చిరు.. నాగబాబు వల్లేనా..!

టాలీవుడ్ తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు తండ్రీ కొడుకుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా మెలుగుతుంటారు. వీరిద్దరి బంధం గురించి ఇంతవరకు ఎలాంటి రూమర్లు కూడా రాలేదు. ఇదిలా ఉంటే చెర్రీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి ఒక్కసారి అతడి మీద చేయి చేసుకున్నారట. అది కూడా 8 సంవత్సరాల వయస్సులో తమ తాత గిఫ్ట్‌గా ఇచ్చిన పోలీస్‌ బెల్ట్‌తో చిరు, చెర్రీని కొట్టారట. ఈ విషయాన్ని […]

చెర్రీని పోలీస్‌ బెల్ట్‌తో కొట్టిన చిరు.. నాగబాబు వల్లేనా..!
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2020 | 2:40 PM

టాలీవుడ్ తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు తండ్రీ కొడుకుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా మెలుగుతుంటారు. వీరిద్దరి బంధం గురించి ఇంతవరకు ఎలాంటి రూమర్లు కూడా రాలేదు. ఇదిలా ఉంటే చెర్రీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిరంజీవి ఒక్కసారి అతడి మీద చేయి చేసుకున్నారట. అది కూడా 8 సంవత్సరాల వయస్సులో తమ తాత గిఫ్ట్‌గా ఇచ్చిన పోలీస్‌ బెల్ట్‌తో చిరు, చెర్రీని కొట్టారట. ఈ విషయాన్ని చెర్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నా చిన్నప్పుడు ఒక్కసారి మాత్రమే నాన్న నా మీద చేయి చేసుకున్నారు. నాకు ఎనిమిదేళ్ల వయస్సులో మా ఇంటి గేట్‌ వద్ద డ్రైవర్, సెక్యూరిటీ మాట్లాడుకోవడం నేను విన్నాను. వారు మాట్లాడిన వాటిలో చాలా వాటికి నాకు అర్థం తెలీదు. దాంతో ఇంట్లోకి వెళ్లి వాటికి అర్థమేంటని బాబాయి నాగబాబును అడిగాను. అదే సమయానికి నాన్న షూటింగ్‌ పూర్తి చేసుకొని వచ్చారు. ఆ తరువాత బాబాయి నన్ను నాన్న రూమ్‌కు తీసుకెళ్లి.. వీడు కొన్ని అసభ్యకర మాటలు నేర్చుకున్నాడు అంటూ కంప్లైట్ ఇచ్చాడు. వెంటనే రూమ్‌లో నుంచి బాబాయిని పంపిన నాన్న.. మా తాత గిఫ్ట్‌గా ఇచ్చిన బెల్ట్‌తో నన్ను కొట్టారు. అవి మంచి మాటలు కాదని.. ఎప్పుడూ అలాంటివి మాట్లాడకని తరువాత చెప్పారు. ఈ ఘటన తరువాత నాగబాబు బాబాయితో నేను చాలా రోజుల వరకు మాట్లాడలేదు అని చెర్రీ తెలిపారు.

ఇక తన తండ్రితో కూర్చొని మాట్లాడటానికి తాను సంశయిస్తుంటానని.. కానీ ఉపాసన మాత్రం ఎలాంటి భయం లేకుండా డైరక్ట్‌గా వెళ్లి మాట్లాడుతుంటుందని చెర్రీ తెలిపారు. తమ ఇంట్లో ఉపాసనకు తన తండ్రి మంచి స్నేహితుడని రామ్ చరణ్ వివరించారు. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న చెర్రీ.. మరోవైపు చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్యను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: బ్రేకింగ్: మధ్య ప్రదేశ్‌లో కరోనాతో ముగ్గురు మృతి

Latest Articles
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్