Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

మేడమ్ ట్రైనింగ్… రాహుల్ రైజింగ్… సెకండ్ ఇన్నింగ్‌కి రె’ఢీ’!

Rahul trip to Cambodia before Assembly Elections, మేడమ్ ట్రైనింగ్… రాహుల్ రైజింగ్… సెకండ్ ఇన్నింగ్‌కి రె’ఢీ’!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టబోతున్నారా? పార్టీ నేతలే ఈ డిమాండ్ చేసే విధంగా హస్తం ముఖ్యులు ఎత్తులు వేస్తున్నారా? యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో ఈ భారీ ఆపరేషన్ సాగుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీలో వృద్ధ నేతలు యువనేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని పేర్కొంటూ ముఖ్యనేతలైన అశోక్ తన్వర్ – సంజయ్ నిరుపమ్ – ప్రద్యుత్ దెబర్ మాన్ తిరుగుబాటు చేయడం పార్టీలో అసంతృప్తికి కారణం కాదని…రాహుల్ కు తిరిగి పగ్గాలు అప్పగించడమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పార్టీలో ఉన్న చాలామంది జూనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మరోమాటలో చెప్పాలంటే.. సోనియా కోటరీ.. రాహుల్ సన్నిహితులను తప్పిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  భవిష్యత్తుపై వారిలో అయోమయం నెలకొంది. రాజీనామాల బాట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విపాసన నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాంబోడియా వెళ్లారన్న వార్త ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్ ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారు? ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతుందనేది రాజకీయవర్గాల మాట. రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు సీనియర్ నేతలు (ముఖ్యంగా సోనియా గాంధీ కోటరీ) అసంతృప్తికి గురయ్యారు. ఆయన పనితీరుపై పలు సందర్భాల్లో అసమ్మతి తెలిపారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ సూచనలకు మద్దతు కరువైంది.

రాఫెల్ వివాదం విషయంలో ప్రధాని మోదీపై రాహుల్ విమర్శల దాడి చేసినప్పుడు కొద్ది మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. ఇక లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాహుల్ ను షాక్ కు గురిచేశాయి. సీనియర్ నేతలు ఎప్పటికీ తనకు అండగా నిలువరని భావించడం ఆయన రాజీనామా చేయడానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే వారి అడ్డుతొలగించుకునేందుకు సీనియర్లపై తీవ్ర విమర్శలు చేస్తూ యువనేతలు పార్టీని వీడుతున్నారు. వీటిని రాహుల్ – సోనియా తర్వాత ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఎన్నికల ముంగిట, ప్రస్తుతం సోనియా దృష్టి అంతా సీనియర్లను తప్పించడంపైనే ఉందని సమాచారం. తద్వారా యువనేతలకు లేదా రాహుల్ టీంకు మార్గం సుగమం చేయనున్నారు. రాహుల్ విపాసన కార్యక్రమం.. ఆయన సెకండ్ ఇన్సింగ్స్‌కు ప్రారంభమని నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనాల ప్రకారం హర్యానా – మహారాష్ట్రలో పార్టీకి ఓటమి తప్పదు. ఎన్నికల ముంగిట – ప్రస్తుతం సోనియా దృష్టి అంతా సీనియర్లను తప్పించడంపైనే ఉందని సమాచారం. ఈ ఓటమితో సీనియర్లకు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా యువనేతలకు లేదా రాహుల్ టీంకు మార్గం సుగమం చేయనున్నారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో – పార్టీ పగ్గాలు రాహుల్ చేపట్టాలనే డిమాండ్ సైతం ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల ముంగిట రాహుల్ విదేశాలకు వెళ్లడంపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత ప్రజాస్వామిక సంప్రదాయంలో వ్యక్తిగత స్వేచ్ఛకు ఎప్పుడూ గౌరవముందని, వ్యక్తిగత విషయాలను ప్రజా జీవితంతో ముడిపెట్టకూడదని స్పష్టంచేసింది. విదేశాల్లో ఉన్నప్పుడు ఎస్పీజీ భద్రతకు సంబంధించి నిబంధనల్లో చేసిన మార్పులపై తమ నేతలకు ఎలాంటి సమాచారం అందలేదని ఆ పార్టీ పేర్కొంది. విదేశాల్లో ఉన్నప్పుడు కూడా నేతలకు ఎస్పీజీ భద్రత కల్పించనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది.

Related Tags