హత్రాస్ జిల్లాకు నేడు రాహుల్, ప్రియాంక గాంధీ, పోలీసు ఆంక్షలు, నిషేధాజ్ఞలు

యూపీలో దారుణ హత్యాచారానికి గురైన 20 ఏళ్ళ యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురువారం ఈ జిల్లాను సందర్శించనున్నారు.

హత్రాస్ జిల్లాకు నేడు రాహుల్, ప్రియాంక గాంధీ, పోలీసు ఆంక్షలు, నిషేధాజ్ఞలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 01, 2020 | 1:03 PM

యూపీలో దారుణ హత్యాచారానికి గురైన 20 ఏళ్ళ యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురువారం ఈ జిల్లాను సందర్శించనున్నారు. అయితే హత్రాస్ లో అప్పుడే పోలీసులు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఐదుగురికి మించి ఎవరూ గుమికూడదని ఆదేశాలు జారీ చేశారు. హత్రాస్ ఘటన అత్యంత దారుణమని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ దుయ్యబట్టారు. ఇది సమాజానికే చెరగని మచ్ఛ అని వ్యాఖ్యానించారు. అటు-రాహుల్ ఈ ఘటనపై ట్వీట్ చేస్తూ, బాధితురాలి హత్యాచారానికి సంబంధించిన వాస్తవాలను యూపీ ప్రభుత్వం తొక్కిపెడుతోందని, ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా ఆమె కుటుంబాన్ని పోలీసులు అనుమతించకపోవడం అత్యంత ఘోరమని ఆరోపించారు. అటు-ఈ జిల్లాకు రాహుల్ లేదా ప్రియాంక గాంధీ వస్తున్నట్టు తమకేదీ సమాచారం అందలేదని హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ లష్కర్ అన్నారు. ఏమైనా 144 సెక్షన్ ను అత్యంత కఠినంగా అమలు చేస్తామన్నారు. కాగా -కరోనా వైరస్ పేరు చెప్పి అధికారులు హత్రాస్ జిల్లాను ‘మూసివేశారు’. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ ఈ జిల్లాను విజిట్ చేయకుండా ‘సీల్’ చేశారు. అడుగడుగునా పోలీసులను మోహరించారు.